నిర్మించారు సరే నీటి సౌకర్యం ఏది 

వికారాబాద్ జిల్లా ప్రతినిధి (జనం సాక్షి )     జనవరి 24

మూగజీవాలకు దాహార్తిని తీర్చాలని లక్ష్యంతో ప్రభుత్వాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ. లక్షల వెచ్చించి నీటి తొట్టెలు నిర్మించింది. అధికారుల  అవగాహన లోపం పర్యవేక్షణ లేని కారణంగా నీటి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. ఫలితంగా గుక్కెడు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించి  నీటి తొట్టెలను  నిర్మించిన అధికార యంత్రాంగం అందుకు అవసరమైన నీటి సౌకర్యం మరిచింది. దీంతో పశువుల దాహార్తి తీర్చలేక పోగా నిధులు నిర్లక్ష్యం అవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా లో ఆవులు గేదెలు గొర్రెలు మేకలు చాలా ఉన్నాయి.రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతున్న భూగర్భజలాలు అడుగంటడంతో నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పశువుల దాహార్తి తీర్చడానికి ఏర్పాటుచేసిన నీటి తొట్టెలో అవినీతి   పగుళ్లు తేలుతున్నాయి. అవసరం లేని ప్రదేశాలలో నీటి జాడ లేని స్థలాల్లో

నాసిరకం నిర్మాణం కారణంగా రూ. వ్యయం నిరుపయోగంగా మారాయి. పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగే బోర్లు నుంచి నీటి సరఫరా చేయాల్సి ఉండగా ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో మేతకు వెళ్లి  తొట్టి వద్దకు  వస్తున్న పశువులు అందులో నీళ్లు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుకకు  తిరుగుతున్నాయి. ఈ వేసవి నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న వీటి తొట్టెలను వినియోగం లోకి తీసుకు రావడం లేదు. పశుసంవర్ధక శాఖ ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. నీటి తొట్టి లకు బోరు ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ కల్పించడంలో దృష్టిసారించడం లేదు. జంతువుల సంరక్షణకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న వాటి దాహం తీర్చడంలో అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోరులేని మూగజీవాలను దాహార్తి తీర్చడానికి గ్రామ ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని గ్రామీణ రైతులు కోరుతున్నారు.  వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ ప్రస్తుతం వేసవి ప్రారంభమవుతుంది .రోజురోజుకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాబోయే రోజులు తాగునీటికి అలమటించే పరిస్థితి మరింత తీవ్రం అవుతాయని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

*పశువుల నీటి తొట్టి ల పై ఫలించని ప్రణాళికలు*

 

గ్రామాలు అభివృద్ధి పథంలో  పయనించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ రెండుసార్లు పల్లె ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ పల్లె ప్రగతి కార్యాచరణ ప్రణాళిక నిర్వహణలో అధికారులు నాయకులు ఏ ఒక్క గ్రామంలో కూడా పశువుల దాహార్తి తీర్చే నీటి తొట్టి లపై పట్టించుకునే నాధుడే లేడు. ప్రతి గ్రామాన్ని విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. నీటి తొట్టిలో విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు నాయకులు గ్రామాల్లో లోని నీటి తొట్టి లకు మరమ్మతులు చేయించి అందులో నీరు  నింపేలా తగు చర్యలు తీసుకోవాలని రైతులు వాపోతున్నారు.