మున్సిపల్‌ ఎన్నికల్లో కారు జోరు


ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం


హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఇప్పటికే ఆయన తెలంగాణ భవన్‌ చేరుకున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో కలిసి ఫలితాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు, నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు.​ మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 120 మున్సిపాలిటీలకుగానూ టీఆర్‌ఎస్‌ వందకు పైగా స్థానాల్లో గెలుచుకునే విధంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాలు సీఎం ఏ విధంగా మాట్లాడుతానేది ఆసక్తికరంగా మారింది.