రాష్ట్రపతి నిలయానికి సందర్శకులకు అనుమతి


హైదరాబాద్‌,జనవరి2 (జనం సాక్షి) :  రాష్ట్రపతి నిలయం సందర్శనానికి సందర్శకులకు అనుమతి లభించింది. దీంతో సందర్శకులు వస్తున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం పర్యాటక కేంద్రంగా 


ప్రసిద్ధి చెందింది. రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. గత నెల 28 వరకు ఇక్కడ బస చేశారు. జనవరి 2 నుండి జనవరి 17 వరకు రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు. అక్కడ ప్రకృతి శోభితమైన, ఆహ్లాదకరమైన పచ్చదనం, ప్రశాంత వాతావరణం ఉంటుంది. భారీ వృక్షాలు వాటి మధ్య ఉద్యానవనాలు, పూలు, పండ్ల తోటలు, ఫౌంటెయిన్లు చూడముచ్చటగా ఉంటాయి. గత సంవత్సరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఓకేసారి 7 వేల మొక్కలను నిలయంలోని ఖాళీ స్థలాల్లో నాటించారు.