కాళేశ్వరం', మిషన్ భగీరథలకు సాయం అందించండి


మౌలిక వసతులకు నిధులు ఇవ్వండి ఆర్థిక సంఘాన్నికోరిన మంత్రి హరీష్ రావు


న్యూఢిల్లీ,జనవరి 27(జనంసాక్షి): 15వ ఆర్థిక సంఘం సమావేశానికి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆర్థిక సంఘం చైర్మన్ నందకిషోర్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో జరుగుతోంది. మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని హరీష్ రావు ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథకు నిర్వహణ నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ రాసిన లేఖను నందకిశోర్ సింగు అందజేశారు. నీతి ఆయోగ్ సిఫారసు మేరకు గతంలో కేందప్రత్యేక 'కాళేశ్వరం', మిషన్ భగీరథలకు సాయం అందించండి మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు.. కేంద్రం ఇచ్చేలా చూడాలని ఆర్థిక సంఘాన్ని హరీష్ రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి పనులను 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ నందకిశోర్ సింగ్ ప్రశంసించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు. ఇలాంటి అద్భుత కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ పథకాల నిర్వహణకు నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ రాసిన లేఖను ఆర్థిక సంఘం చైర్మన్‌కు ఆందజేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 83 మీటర్ల నుంచి 618 మీటర్లకు నీళ్లను ఎత్తడం జరుగుతున్నది. ఈ నిర్వహణ ఖర్చు చాలా ముఖ్యం. నీళ్ల కోసమే తెలంగాణ పోరాడింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో.. గత ఐదు సంవత్సరాలలో పాలమూరు ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం సహా? గతంలో పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రాజెక్టుల నిర్వహణకు రూ. 42,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే ప్రతి ఇంటికి నీరు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇస్తున్నాం. ఈ నేపథ్యంలో వచ్చే ఐదు ఏళ్లకు మిషన్ భగీరథ నిర్వహణకు 12 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినం. కేంద్రం ఇంటి ఇంటికి త్రాగునీరు ఇచ్చేందుకు అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది. అయితే? తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు ఇప్పటికే ఈ పథకాలను పూర్తి చేశాయి. పథకాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహణ ఖర్చులు ఇచ్చేలా కేంద్రానికి సూచించాలని కోరినం. మేము కోరిన రెండు అంశాలపై ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూలంగా స్పందించారు." అని మంత్రి హరీష్ రావు తెలిపారు. “ రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా చేస్తోంది. కొత్త రాష్ట్రమైన కూడా ముఖ్యమంత్రి పనితీరును ప్రశంసిస్తున్నాం అని ఆర్థిక సంఘం ఛైర్మన్ నందకిశోర్ సింగ్ అన్నారు. అత్యంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు? మీరు కోరిన అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు. కమిషన్ కాల పరిమితి పెరిగిన నేపథ్యంలో ప్రాంతీయ సదస్సులు పెట్టాలనుకుంటున్నామని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు హైదరాబాద్లో నిర్వహించాలని అనుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్లో సదస్సు నిర్వహిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తాం" అని ఆర్థిక సంఘం ఛైర్మన్ నందకిశోర్ సింగ్ అన్నారని.. మంత్రి హరీష్ రావు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు హైదరాబాద్ లో నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తుందని ఆర్థిక సంఘానికి స్పష్టం చేశామన్నారు మంత్రి. జీఎస్టీ చెల్లింపుల అంశంపై కూడా ఆర్థిక సంఘం చైర్మన్ అడిగారని? జీఎస్టీ రూ. వెయ్యి కోట్లు, ఐజీఎస్టీలో రూ. 2,500 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించామన్నారు. రాష్ట్రంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణకు రూ. 52,700 కోట్లు ఇవ్వాలని కోరినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. మావోయిస్టు పార్టీ నూతన కేంద్ర కమిటీ