గిరిజనలంబాడాలకు బీజేపీ పార్టీ ద్రోహం చేస్తోందా..?


గిరిజన లంబాడాల పై బిజెపి పార్టీ సవతి తల్లి ప్రేమ
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షల పైచిలుకు జనాభా ఉన్న గిరిజన లంబాడీలకు బిజెపి పార్టీ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గిరిజన లంబాడీల జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సమాజంలో అవహేళన పడే విధంగా అసత్య ఆరోపణలు చేస్తూ గిరిజనలంబాడి సమాజాని ST జాబితాలోకి దొడ్డి దారిన వచ్చినట్లుగా చిత్రీకరిస్తున్నారు. అంతేకాకుండా లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తు బీజేపీ పార్టీ పార్లమెంట్ సభ్యుకి ముందు పెట్టి తెలంగాణ లో అలజడి సుస్థిసింది. బీజేపీ మెండ్ గేమ్ ఆడుతున్నరు. బీజేపీ పార్టీ వెనక ఉండి నడిపించడం సిగ్గుచేటు ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గౌరవించుకోవడం జరుగుతుంది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే  విధంగా ఒక చట్టసభల్లో మాట్లాడే వ్యక్తి ఇలా తప్పుడు ఆరోపణలతో గిరిజన సమాజంనికి అవహేళన చేయడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా బిజెపి ప్రభుత్వం హయాంలో పార్లమెంట్ సభ్యుడు ఇలా వ్యవహరించడం సమాజానికి తీరని లోటుగా భావించవచ్చు. ఇదే బిజెపి ప్రభుత్వం ఇప్పటి హోం శాఖ మంత్రి , బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ లో గిరిజనులకు 10 శాంతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వంనికి లెటర్ ఇస్తాడు, మళ్లీ తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి గిరిజన లంబాడీల ఓటు బ్యాంకు ను బీజేపీ పార్టీ వేపు మలుసుకోవాడనికి సెటిమెంటుగా బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గిరిజన లంబాడి మహిళాతో శ్రీకారం చుట్టారు. గిరిజన లంబాడీల దగ్గరికి వెళ్లి తొలి సభ్యత్వాన్ని నమోదు చేశారు . ఒక వైపు బిజెపి లో గిరిజన లంబాడీల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు బిజెపి పార్లమెంటు సభ్యుడు లంబాడీల జాతి ఆత్మగౌరవం పై దాడి చేస్తున్నారు.గిరిజన తెగల మధ్య చిచ్చు రేపుతున్న బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సోయంబాబురావు  ఆరోపణల పై
బీజేపీ పార్టీ నేతల దృష్టికి ఇప్పటికే గిరిజన లంబాడీల, ఎరుకల, యానది  నాయకులు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి,అనేకసార్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర గవర్నర్ తీసుకోవేళ్ళయారు. అయిన బీజేపీ పార్టీ వైఖరి ఇంటింది, ఆ పార్టీ సాండ్ ఏమిటో స్పష్టం చేయడం లేదు, అంటే ఈ ఆరోపణలకు సూత్ర దారి పాత్ర దారి
  బిజెపి పార్టీ అని రుజువు అయింది అంతే కాకుండా ముందు నుండి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ గిరిజనుల పట్ల వివక్షత చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఉదాహరణకు
తెలంగాణ రాష్ట్ర విభజన లో భాగంగా తెలంగాణ లో కేంద్రీయా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం విశ్వవిద్యాలయం కేటాయిస్తే ఆ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభించడానికి బిజెపి ప్రభుత్వం ఏడు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించి  విశ్వవిద్యాలయం  రూపు దాల్చడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో విఫలమైంది గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు మాట లేకుండా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తే గిరిజనులను పట్ల వారి ప్రేమ అర్థమవుతుంది అంతేకాకుండా
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల కు10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి గిరిజన రిజర్వేషన్ బిల్లును పంపిస్తే దానిని కూడా అణచి వేసింది ఆ రిజర్వేషన్ బిల్లును ఆమోదించ లేదు.అంతేకాకుండా గిరిజన రిజర్వేషన్ బిల్లు పై కేంద్ర ప్రభుత్వం వైఖరి ఇప్పుడు వరకు స్పష్టం చేయలేదు.కనీసం రాష్ట్ర ప్రభుత్వం నికి గిరిజన రిజర్వేషన్ పొడిగించడం గురించి
ఎలాంటి డెయిరెక్షన్ ఇవ్వాలేదు. గిరిజనులకు బిజెపి ప్రభుత్వం మద్దతు ఉందా  లేదా అనే విషయంలో దొంత వైఖరి విధానం దాగుడుమూత అర్థమవుతుంది నిజంగా గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే బిజెపి ప్రభుత్వం ఓ బి సి 10 శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో  గిరిజన 10 శాతం రిజర్వేషన్ బిల్లును కూడా చేసేవాళ్ళు గిరిజనుల పట్ల సవతి తల్లి ప్రేమ అనేది బిజెపి పార్టీ వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది
తెలంగాణ రాష్ట్ర  మహుబాబుబాద్ బయ్యారంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కేంద్ర గనుల శాఖ మంత్రి ఎప్పుడు వరకు ఊసే లేదు
మహబూబ్ నగర్ నల్లమల్ల అడవుల్లో
రాజీవ్ గాంధీ పులులు అభయారణ్యం పేరుతో డీబీర్స్ కంపెనీకి వజ్రాల తవ్వకానికి ఇచ్చి గిరిజనులకు, చెంచులను నిర్వాసితులను చేస్తున్నారు ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ కన్నా వినియోగదారుల వ్యవస్థ వస్తు మార్పిడి ఎక్కువగా ఉంటుంది దళారీ వ్యవస్థ కూడిన మైదాన ప్రాంతంలో గిరిజనుల జీవన  ఆగమ్యగోచరంగా  మారుతుంది వారికి ఉపాధి కరువవుతుంది ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం ఇవ్వకుండా  గిరిజనుల జీవితాలతో చెలగాటం ఆడటం ఇవాళ  కొత్తేమీ కాదు.
అడవులు అభయారణ్యాలు అంతరించిపోతున్నాయి దట్టమైన అడవులు స్వచ్ఛమైన నీటికి విలువైన అడవి ప్రాంతాలు ఇప్పుడు బడా నేతల చెప్పుచేతల్లో అడవి భూములు హారతి కర్పూరం గా కరిగిపోతున్నాయి  అసలు అడవులను ఎందుకు కొల్లగొడుతున్నారు
కార్పొరేట్లకు అమ్ముడుపోయి దేశప్రయోజనాల ముసుగులో తెలంగాణ అటవీ సంపదను దోచుకోడానికి స్కెచ్ వేసిన పువ్వు పార్టీ. అందాల అడవి పై అనుబాంబులాగా
యురేనియం నిక్షేపాల అన్వేషణను తెలంగాణ అటవి శాఖ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రక్షిత అటవీ ప్రాంతాలలో వందల మీటర్ల లోతు డ్రిల్లింగ్ చేయడంవల్ల అడవి సంపద నాశనం అయ్యే ప్రమాదం ఉందని పేర్కొనబడింది
ఈ మేరకు 2016లో కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పించింది అయినా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా యురేనియం తవ్వకాల పేరుతో గిరిపుత్రుల గొంతు కోసే యంత్రం, అడవి బిడ్డలకు కేంద్రం అండగా ఉండవలసింది పోయి వారి గొంతులు కోయడం వారి హక్కులను భంగం చేయడం వారి హక్కులను కాలరాయడం ఇదెక్కది
                అటవీ భూములతో విడదీయరాని అనుబంధం ఏర్పరుచుకున్న 90 లక్షల మంది గిరిజనులను అక్కడి నుంచి తరలించే ప్రక్రియను నిలిపివేయాలనే ఐక్యరాజ్య సమితి నిపుణులు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం  జులై 4 .2019 ప్రకటన విడుదల చేసింది రక్షిత  అటవీ ప్రాంతాలను ఆక్రమించడం వల్ల అడవులు అంతరించిపోతుంది. వన్యప్రాణి సంరక్షణ సంస్థలు వేసిన కేసులో  ఫిబ్రవరి13వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం ఆదివాసీలను కాలి చేయించేందుకు ఉపక్రమించిన విషయాన్ని గుర్తు చేస్తుంది .
కేంద్ర  ప్రభుత్వాలే గిరిజనుల చేత పోడు  మాన్పించడం కోసం కొన్ని చట్టాలు సర్క్యులర్ సంరక్షణ బిల్లులు తీసుకొచ్చారు. 1981లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన సర్క్యులర్లు 1996లో వన సంరక్షణ సమితులు ఏర్పాట్లు ఆదివాసుల వ్యవసాయాన్ని మాన్పించడం కోసం చేసిన ప్రభుత్వం 56 షెడ్యూల్ పైసా 1 /70, అటవీ హక్కుల చట్టం ఇలా ఎన్ని చట్టాలు ఉన్న  ఇప్పటికే భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు, పరిశ్రమలు ,రిజర్వ్, ఫారెస్ట్, టైగర్ జోన్, తదితర పేర్లతో  ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల వల్ల ఇప్పటికే గిరిజన ప్రజలు తీవ్రంగా నష్టపోయారు . తమ భూములను కాపాడుకోవాలంటే అటు ప్రభుత్వాలతో ఇటు ఫారెస్టు అధికారులతో తెగించి పోరాటం చేస్తూనే ఉన్నారు.


తెలంగాణ దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా గిరిజనులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అలాంటి ఈ రాష్ట్రం లో ఇప్పటివరకు గిరిజనుల సంక్షేమం కోసం గిరిజనులకు శ్రేయస్సుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన నిధులు కానీ పథకాలు కాని అభివృద్ధి కార్యక్రమాలు కానీ శ్రీకారం చుట్టే లేదు అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చేంది. కానీ ఇప్పటి బిజెపి ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్రానికి ఆ పథకాలు కాని ఆ కార్యక్రమాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి వారి అభివృద్ధిని ప్రోత్సహించడానికి అది ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా వివిధ రంగాల్లో గిరిజన అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా లేదు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్టడమే కాకుండా ఆ వివక్షతలు భాగంగా గిరిజనుల మీద సౌత్ తల్లి ప్రేమ బిజెపి ప్రభుత్వం స్పష్టంగా అర్థమవుతుంది
లంబాడీల డెమో తప్పు చేసినట్టు వాళ్లకు నిందితులుగా లేక ఒక దోషులుగా సమాజంలో చిత్రీకరించి లంబాడీల ఆత్మగౌరవాన్ని హెలన చేసే విధంగా అసభ్య పదజాలంతో లంబాడి సమాజాన్ని దూషించడం ఒక పార్లమెంటు సభ్యుడు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అంతేకాకుండా ఈ ఉద్యమాలు చూసిన ఏ పోరాటాలు చూసిన ఏ ఉద్యమకారుడు అయినా మాకు ఇది కావాలని అడుగుతారు అనేక సందర్భాల్లో మాకు ఇది కావాలి అని అడుగుతారు కానీ వాళ్లకు ఇది వద్దు అనేవాళ్ళు ఎక్కడ చూడలేదు ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా గోండు కోయ లకు అభివృద్ధికి ఈ సంక్షేమ కార్యక్రమాలు మా కు ప్రత్యేకమైన ప్యాకేజీలు కావాలని అడగాలి కానీ గిరిజన లంబాడి సమాజంలో మొదటి జనరేషన్ రెండు శాతం అభివృద్ధికి నోచుకోని మిగతా 98 శాతం అట్టడుగున నాగరిక సమాజానికి దూరంగా నాగరిక సమాజంలో కొట్టుమిట్టాడుతున్న కట్టెల అమ్ముకుంటున్న చేతులతో కన్న బిడ్డను అమ్ముకున్న దుస్థితిలో నేటికీ ఉన్నారు అంతేకాకుండా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా అనేక రంగాల్లో వెనకబడి ఉన్నారు బతుకుతెరువు లేక రెక్కాడితే బుక్కెడు బువ్వ  కష్టాన్ని నమ్ముకుని నిరంతరం కష్టపడుతూ ఇవాళ ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వెళ్లి తమ కష్టం మీద బతుకుతున్న జాతి గిరిజన లంబాడీల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన లంబాడీలు అనేక మంది యువత పీజీలు డిగ్రీలు ఇంటర్మీడియట్ ఇలా అనేక చదువులు చదివి ఉపాధి లేక నిరుద్యోగులుగా ఇవాళ హైదరాబాద్ ప్రాంతం లాంటి వివిధ నగరాలలో మండలాల్లో గ్రామాల్లో కూలీలుగా అడ్డ మీద సుతారి పనులకు , ఫంక్షన్ లో క్యాటరింగ్ సప్లై ఏ పని దొరికితే ఆ పనిలో పని చేసుకుంటూ తమ కష్టం మీద ఆధారపడి బతుకు బండిని ముందుకు లాగుతు జీవిస్తున్నారు ఉదాహరణకు ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ పెళ్లి కార్యక్రమాల్లో చూసిన గిరిజన లంబాడీల యువకులు కనిపిస్తూ ఉంటారు అలాంటి ఈ గిరిజన లంబాడి సమాజాన్ని పట్టుకొని అభివృద్ధి చెందారు వారిపై అవాకులు చవాకులు మాట్లాడుతూ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ లెక్క పత్రం లేని నిందలు వేస్తూ మాట్లాడడం యావత్ గిరిజన సమాజానికి హాని కరం గా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది
అంతేకాకుండా గతంలో సోయంబాబురావు అనేక తప్పుడు కార్యకలాపాలకు పాలుపడింప్పుడు కేసుల్లో ఉన్న వ్యక్తి కి బలుపు ఎందుకు గిరిజన లంబాడీ సమాజం ప్రశ్నింస్తున్నారు.
చట్టసభల్లో ఉండే సభ్యులు, పార్లమెంటు సభ్యుడు హోదాలో ఉన్న ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయంబాబు రావ్ తో  పాటుగా ఇతర శాసనసభ్యులు , ఇతర వర్గాల రాజకీయ నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకు అమాయక గిరిజన లంబాడీల ఆత్మగౌరవానికి కించపరిచే విధంగా గిరిజన లంబాడీలను దోశులుగా, వలసవాదులుగా,గిరిజనులు కాదని, లంబాడీలు అందరూ బాగుపడ్డారని చిత్రికరించటాన్ని, తప్పుడు ప్రచారాన్ని గిరిజన లంబాడి సమాజం  తీవ్రంగా  ఖండిస్తుంది
  అమాయక గిరిజన లంబాడీలపై కావాలని  కుట్రలు చేస్తున్నారని, లంబాడీలపై తప్పుడు సంకేతాలతో సమాజాన్ని "తప్పుదోవ పట్టించే" కార్యక్రమాలకు పాల్పడుతూ ఇలాంటి పనులు చేస్తే ఇక ముందు యావత్ గిరిజన లంబాడా సమాజం భవిష్యత్తులో చూస్తూ ఊరుకునేది లేదని, ఒకటికి రెండు సార్లు ఈ పరిణామాలను పై చర్చించటం జరిగింది. గిరిజన లంబాడీల సమాజం ఓపిక సహనాన్ని  పరీక్షించడం మంచిది కాదు ఈ సంఘటనలకు  కారకులను వివిధ వర్గాల,వివిద పార్టీల లంబాడీలకు వ్యతిరేకంగా పనులు చేస్తూన్న వారికి త్వరలో సరైన బుద్ధిచెప్పక తప్పదని గిరిజన లంబాడీ సమాజం హెచ్చరింస్తుంది
గిరిజన లంబాడీల జాతికి  ఏదురౌతున్న  సవాళ్లను, రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు అతీతంగా ఏవిధంగా ఐక్యత బలంతో దైర్యంగా ఏదుర్కోదానికి సిద్ధం
  అమాయ లంబాడా గిరిజనుపై జరుగుతున్న కుట్రలను, దాడులను , దుష్రచారాన్ని తిప్పి కోట్టటానికి   గిరిజన లంబాడీలు తమ నంగారా మోగించడం ఖాయము. ముమ్మాటికీ మేము లంబాడీలు గిరిజనులే ఇందులో ఎలాంటి సందేహం లేదు గిరిజన లంబాడీల సంస్కృతి ఆచార వ్యవహారాలు పండగలు చూసిన గిరిజనులకు ఎస్టీలుగా గుర్తించడానికి రాజ్యాంగం కల్పించిన ఐదు ప్రధాన అంశాలు , లక్షణాలు గిరిజన లంబాడీలకు  ఉన్నాయి.గిరిజన లంబాడీలు
ప్రకృతిని పూజించే ఆచారం
తీజ్ అనేది మా ఉత్సవం
మొలకెత్తిన మొక్కలు నెత్తిన పెడతాం
తాళం డప్పు శబ్దాలు చేస్తాం , సామూహిక జీవన విధానం లంబాడి కుటుంబాల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. గిరిజన లంబాడీలకు ప్రత్యేకమైన భాష గోర్ బోలి భాష ఉంది.
కష్ట సుఖాలను మా జానపద గేయాల్లో చూపిస్తాం
ప్రకృతిని కాపాడమని ప్రార్థిస్తాం


తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం కావాలని గిరిజన లంబాడీల పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు గోండు సోదరులు అది వారి  అవివేకమా కొంతమంది నాయకు లు కొన్ని పార్టీలు మీడియా పత్రికలు గిరిజన శక్తిని విచ్ఛిన్నం చేయడానికి విభజించు పాలించు అనే ఫార్ములాలను ఉపయోగించుకొని ఐక్యత ను దెబ్బతీయడానికి ఇలాంటి కుట్రలు కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది భారతదేశంలో 744 గిరిజన తెగలు ఉన్నాయి రాజ్యాంగంలో  గిరిజన పేర్లు ఆదిమ జాతులు, షెడ్యూల్ తెగలు, గిరిజనులు, ఆదివాసీలు, ట్రైబల్  పొందుపరిచిన్నారు. ఇన్ని పేర్లతో పిలువబడే గిరిజనులు  తెలంగాణ రాష్ట్రంలో సుమారు 13 గిరిజన తెగలు ఉన్నాయి కోయ, గోండు, లంబాడీలు, ఎరుకల ,చెంచు, నాయక్ పోడ్, కొల్లం, తోటి,యానది, కొండరెడ్లు ,పార్ధన్, ఆంధ్. ఈ గిరిజన తెగల గురించి భారత రాజ్యాంగం లో ని ఎక్కడ గోండులు కోయలు లంబాడీలు ఈ తెగల వారు వేరు వేరు అని రాజ్యాంగం చెప్పలేదు రాజ్యాంగంలో ఎక్కడా లేదు రాజ్యాంగం కన్నా ఎక్కువ నా పోనీ గోండులు కోయ లు రాజ్యాంగేతర శక్తులు లేకపోతే దేశంలోని రాజ్యాంగాన్ని వ్యతిరేకించే శక్తుల గోండులు అనేది ఆలోచించుకోవాలి ఇలాంటి పిట్టకథలు చిలక పలుకులు ఇప్పటికైనా మానేయండి గిరిజన లంబాడీల  పార్లమెంట్ అమెండ్మెంట్ యాక్టు ద్వారా 108/1976  లో గిరిజన లంబాడీలు,ఎరుకల, యానది ఈమూడు తెగలకు ఎస్టీలుగా గుర్తించ పడ్డారు లంబాడీల పై అసత్య ఆరోపణలు చేస్తూ లంబాడీల ఓపిక సహనాన్ని పరీక్షిస్తూ భవిష్యత్తులో జరిగే పరిణామాలు మీరే బాధ్యత వహించాలి గిరిజన లంబాడీలు రాజ్యాంగం ప్రక్రియల ద్వారా అని ఎస్టీలుగా గుర్తించారు తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన లంబాడీల జనాభా లేనిది ఇతర గిరిజన తెగల జనాభా శాతం 2 నుంచి రెండున్నర శాతం మాత్రమే దయచేసి ఆలోచించాలి గోండు కోయ సోదరులారా మీ జనాభా రెండున్నర శాతం తోనే గోండులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అవుతార అసలు కారు మీకు బడ్జెట్టు రెండు శాతమే వస్తుంది మా గిరిజన లంబాడీల జనాభా వలన ఇప్పుడు మీరు ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు వందలాది మంది జడ్పీటీసీలు వేలాది మంది ఎంపీటీసీలు సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు గా ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఐటీడీఏ లకు ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేకమైన బడ్జెట్లు వస్తుంది అది మీరు మర్చిపోవద్దు ప్రతి ఆదివాసి లు అసలు విషయాన్ని తెలుసుకోవాలి ఇవన్నీ మర్చిపోయి 1/70 యాక్ట్ ప్రకారం అడవిలో ఉన్న భూములపై గిరిజనులకు హక్కు అలాంటిది భూ బదలాయింపు చట్టం కింద ఇవాళ భూములు దక్కకుండా చేస్తున్నారు అలాంటి విషయాలు మాట్లాడారు రిజర్వేషన్ పెంచడం గురించి, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి గిరిజనుల సంక్షేమం అభివృద్ధి గురించి ఏనాడూ మాట్లాడరు మీకు గిరిజనుల  మీద చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల హక్కుల గురించి పోరాటం చేద్దాం  ఏనాడు పోరాటం చేయరు గిరిజనులకు రావాల్సిన హక్కులు నిధులు వాటా గురించి ఎప్పుడు మాట్లాడారు ఇలాంటి విషయాలను వదిలి పెట్టేసి చెప్పుడు మాటల తో విని అసత్య ఆరోపణలు చేయడం మీకు సులభమైంది
భారతదేశం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడే అనాగరిక సమాజం నుండి నాగరిక సమాజంలో రెండు శాతం గిరిజన లంబాడీల అభివృద్ధి బాట వైపు ప్రయాణిస్తుంటే కొంతమంది అభివృద్ధిని ఓర్వలేక పోతున్నారు
గిరిజన లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తీసివేయాలి అనే పదం ను గోండు సోదరులు వెంటనే వెనుకకు తీసుకొని ఆ పదానికి విడ్రా చేసుకోవాలి. గోండు కోయ సోదరులారా అమాయక గిరిజన లంబాడీల పై అసత్య ఆరోపణలతో రెచ్చ గొట్టకండి లంబాడీలు శాంతికాముకులు మీ స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన లంబాడీల పై బురదజల్లడమే మానుకోండి
లేనిపక్షంలో గిరిజన లంబాడీలు దెబ్బ భవిష్యత్తులో చూపించడం ఖాయం ఈ విషయాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ సంఘటనలను రూపుమాపాలని గిరిజన సమాజం కోరుతుంది
గోండు కోయ లకు గిరిజన లంబాడి సమాజం ఆపిల్ చేస్తున్నాం మీరు ఏదైతే తప్పుడు ఆరోపణలతో పిచ్చి కుక్క లాగా మరుగుతున్న రో అది మీ వివేకముతో ను లేదా అవివేకంతో లేకపోతే కొందరి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసము లేక ఈ ప్రతిపాదన వెనుక అసలు మరమ్మత్తులు మతలపు ఏమున్నాయో మాకైతే తెలియదు కానీ 342 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ ప్రక్రియ ద్వారా వచ్చిన గిరిజన లంబాడి నన్ను పట్టుకొని రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అవమానించే విధంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా రాజ్యంగా విద్రోహ శక్తులు లాగా రాజ్యాంగేతర శక్తి రాజ్యాంగాన్ని వ్యతిరేకించే గోండులు కోయలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వాంటెడ్ లీ కావాలని గిరిజన లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడానికి అవమానిస్తూ గోండులు కోయలు ఎస్టీ జాబితాలో నుండి లంబాడీలను తొలగించాలని డిమాండ్ అర్ధరహితమైనది అయినా ఎస్టీ జాబితాలో నుంచి లంబాడీలను తొలగించాలని ఆరోపణలు చేస్తున్న ఉదాహరణకు ఎస్టీ జాబితాలో నుంచి లంబాడీలను తొలగిస్తే కోయ గోండు లకు మిగిలేది రెండు శాతం మాత్రమే అంతగా అనుకుంటే ఇప్పటివరకు మూడు శాతం జనాభా మాత్రమే అనేది అర్థం చేసుకోవాలి
గోండు కోయ లకు అన్యాయం ఎక్కడ జరిగింది దీన్ని నిర్ధారణ చేద్దాం కానీ ఇతరుల మాట విని గిరిజన లంబాడీల పై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేయడం గోండు కోయలకు తగదు గిరిజన శక్తిని విచ్ఛిన్నం చేయడం మంచిది కాదు అని హితవు పలుకుతున్నారు మీరు కోయ గోండు ల ఎక్కడ ఎక్కడ ఉన్నారు అదిలాబాదులో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఉన్నారు కోయలు వరంగల్ లో ఒక అసెంబ్లీ స్థానంలో ఉన్నారు ఖమ్మంలో 5 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నారు మిగతా 99 స్థానాల్లో లంబాడీలు ఉన్నారు అలాంటి గిరిజన లంబాడీల పై ఆరోపణలు చేసి  మీరు లంబాడీల పై కన్నేస్తే మాడి మసి అయిపోతారు మీకు నిజంగా గిరిజనుల అభివృద్ధి పై ఆదివాసి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే గిరిజనులకు రావలసిన హక్కులపై కలిసి పోరాటం చేద్దాం 10 శాతం గిరిజన రిజర్వేషన్లపై పోరాటంలో కలిసి రండి1/ 70 చట్టం పోరాటం చేద్దాం మీకు రావాల్సిన నిధులు గురించి కలిసి పోరాడుతాం మీ ఎమ్ టి మేము ఉంటాము కానీ మీ అసత్య ఆరోపణలు మానుకోవాలి గిరిజన లంబాడీల వలసవాదులు ఎలా అవుతారు మీ కన్నా ముందు నుంచి నిజాం స్టేట్లో లంబాడీలు ఉన్నారు మీరు వలసవాదులు గోండ్వానా నుంచి వలస వచ్చిన అసలు వలసవాదులు మీరు మిమ్మల్ని కూడా  మేము వలసవాదులు అనవలసి వస్తుంది మీరు చించోలి నుంచి గడిచి గోండ్వాన్ నుంచి నాగపూర్ నుంచి మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ జార్ఖండ్ ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి మీరు కూడా  వలస వచ్చారు మిమ్మల్ని కూడా వలసవాదులు చెప్పాలి మేము గిరిజన లంబాడీలు నిజాం స్టేట్ లో ఉన్న వాళ్ళం మా పూర్వీకులు గోల్కొండ ఖిల్లా ఆయన నా ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ నిజాం ప్రభువుల తో కలిసి  పని చేసిన అనేక సంఘటనలు ఉన్నాయి దానికి నిదర్శనం గోల్కొండ కోట లో బంజారా దర్వాజ పేరు జగదంబ తల్లి దేవస్థానం ఉంది దీని కన్నా ఎక్కువ ఆధారం కావాలి వాస్తవంగా మేము నిజాం స్టేట్ వాసులం నిజాం స్టేట్ విడిపోయిన తర్వాత నాలుగు జిల్లాలు రాయలసీమ లో నాలుగు జిల్లాలు కర్ణాటకలో కలిసి నాయి బీదర్ బీజాపూర్ గుల్బర్గా రాయచూర్ అదే విధంగా ఏడు జిల్లాలు మహారాష్ట్ర ఆనాటి నిజాం స్టేట్  వాసులం మేము గిరిజన లంబాడీలు బయటివాళ్ళు కాదు నేటికీ మహారాష్ట్రలో కలిసిన వాళ్ళుల ఆస్తులు కూడా హైదరాబాదులో ఉన్నాయి కేవలం లంబాడీల కాకుండా ఇతర కులాల వారికి కూడా ఇక్కడ ఉన్నాయి కర్ణాటక ఇక్కడ ఉన్నాయి ఇవాళ హైదరాబాదులో ఉన్నవాళ్లను ఇట్లా వలసవాదులు అంటారా గోండులు కోయలు గిరిజన లంబాడీలకు వలసవాదులు గా చెప్పడం సిగ్గుచేటు లంబాడీలను కార్నర్ చేయడం గోండులు కోయలు గిరిజనుల అని చెప్పుకోవడం మీకు ఎవరు ఇచ్చినారు ఆ హక్కు మా జోలికి రాకండి
1965  "లోకూర్ ఆడ్వైజరి" కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి ఏర్పడ్డ పార్లమెంటరీ జాంట్ ఆక్షన్ కమిటీ *"చందా కమిటీ*" .
ఈ *"చందాక కమిటీ 1969"  పార్లమెంటరీ  జాయింట్ ఆక్షన్* "కమిటీ సిఫార్సుల"  మేరకు  *1976 లో 342 ఆర్టికల్* 2వ విభాగం ద్వారా రాజ్యాంగ బద్దంగా వారి స్థితిగతుల, జీవన విధానం, ఆర్థిక పరిస్థితుల  ఆధారంగా చేసుకొని " ఎరుకల, యానాది, లంబాడీలను"  ST జాబితాలో చెర్చడం జరిగగింది.
రాజ్యాంగం 342/ 1 342/2 చదవండి దీని ప్రకారమే షెడ్యూల్ ట్రైబ్స్ అయ్యాము మేము గిరిజన లంబాడీల 108 / 1976 యాక్ట్ ద్వారా అమెండ్మెంట్ ఆర్డర్ ద్వారా లంబాడీలు ఎస్టీలుగా గుర్తింపు పొందారు కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకొని తర్వాత తదుపరి హోం శాఖ మినిస్టర్ బిల్లు ప్రిపేర్ చేసినది పార్లమెంట్ లో రాష్ట్రపతి ఆస్టెన్ తో పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసింది తదుపరి ఎమర్జెన్సీ సమయంలో లో ఆరు నెలల కాలం తర్వాత జీవో వచ్చింది అప్పుడు ప్రభుత్వం మారడం వలన కొంత సమయం పట్టింది అంతేకానీ ఇక్కడ ఎస్.ఆర్ శంకర్ గిరిజన కార్యదర్శిగా ఉండే అప్పుడు గిరిజన లంబాడీల జీవో రాలేదని అప్పటి ప్రభుత్వానికి లెటర్ ఇచ్చారు అంతే తప్ప వేరేది ఏమి లేదు  దాన్ని పట్టుకొని 108/ 1976 యాక్ట్ ను మర్చిపోయి ఎస్.ఆర్.శంకర్ లెటర్ నో చూసుకొని గిరిజన లంబాడీలు దొడ్డిదారిన వచ్చినారు చెప్పడం సభము కాదు మంచిది కాదు గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని గిరిజనుల గిరిజన లంబాడీల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు గిరిజన లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తీసివేయాలని చెప్పడానికి మీకు ఎవరు ఇచ్చినారు ఆ హక్కు అలా అనడానికి మీరు ఎవరు


తెలంగాణ గిరిజనుల మద్య  చిచ్చుకు  
BJP,  CONGRESS పార్టీలలు  గిరిజనుల మద్య చిచ్చు  ఆ రాజకీయ పార్టీల, నాయకుల "అంతర్గత కుట్రలో"  బాగమేనని చెప్పక తప్పదు
BJP MP సోయం బాబురావు తన వ్యాఖ్యల్ని వెనక్కి తిసుకుని, నిజంగా తనకు అమాయక గిరిజనుల అభివృద్ధిపై చిత్తశూద్దే ఉంటే  అందరికీ లబ్ది చేకూర్చే గిరిజన రిజర్వేషన్ అమలు  అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాడాం వదిలేసి
ఇటీవల పార్లమెంటులో "ఎరుకల,యానాది, లంబాడీలను*" ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చేసిన వ్యాఖ్యలను  పార్లమెంట్లో ప్రస్తావించడం సిగ్గుచేటు దీన్ని బట్టి చూస్తుంటే గిరిజనుల అభివృద్ధి మీద బాబురావుకు ఉన్న చిత్తశుద్ధి మనకు అర్థమవుతుంది
అమాయక లంబాడీలు అంటే గిట్టని కొన్ని పార్టీలు, ఇతర రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం MP సాయం బాబు రావ్ ని ఉసిగోలపడం వల్ల అమాయక గిరిజనుల మద్య చిచ్చు పెడుతున్నారని, ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరుగుతున్న క్రమంలో గోండులు కోయలు నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సీమాంధ్ర నాయకులకు అమ్ముడుపోయి మన్యసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన తీసుకువచ్చిన వీళ్ళు ఇవ్వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా ఆటంకం కల్పించిన నాయకుడు ఇతను నేడు తెలంగాణ లో గిరిజనుల "అభివృద్ధికి అటంకంగా" మారుతున్నారు
70 సంవత్సరాల  స్వతంత్ర భారతంలో గిరిజనుల బతుకుల్లో ఏమాత్రం మార్పు జరగలేదు,  పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తూ అమాయక ప్రజల మధ్య చిచ్చుపెట్టె విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సొయం బాబూరావును "పార్టీ నుంచి సస్పెండ్ " చేయాలని, లంబాడీల స్థితిగతులపై బీజేపీ పార్టీ  వైఖరిని స్పష్టం చేయాలి.తెలంగాణ రాష్ట్రంలో
గిరిజనులు అత్యంత  వెనుకబడి ఉన్నారని
డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్
9908817986