పంట మార్పడి విధానం పాటించాలి




జహీరాబాద్ మే 30  (జనంసాక్షి)  రైతులు పంట మార్పిడి విధానం పాటించాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. శనివారం  నియంత్రిత వ్యవసాయ సాగు విధానం లో భాగంగా  చిల్కేపల్లి, గంగాపూర్, చిలేపల్లి తండా, భోజ్యా నాయక్ తండా,గ్రామాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, మొక్కజొన్న పంటను వేయకూడదు అని తెలియజేయడం జరిగింది, అన్ని గ్రామాల్లో రైతులందరు మొక్కజొన్న వెయ్యబోమని తీర్మానం చేశారు, మొక్కజొన్న బదులుగా పత్తి, కంది, సొయా పంటలను వేస్తామని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానం మండల  వ్యవసాయ అధికారి వెంకటేష్, ఆయా గ్రామ సర్పంచ్ లు  గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు ఏ ఈ ఓ లు సుకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, రేణుక, శివప్రియ, జ్ఞానం, మమతా, స్వాతి, రైతులు సుభాష్, విజయ్, మనయ్య తదితరులు పాల్గొన్నారు.