రేప‌‌టి నుంచి ఎపి బడ్జెట్‌ సమావేశాలు 


వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్న గవర్నర్‌
విూడియాకు అనుమతి లేదన్న చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి
అమరావతి,జూన్‌15(జ‌నంసాక్షి): ఎపి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాు మంగళవారం నుంచి జరుగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ సమావేశాు ఈనె 20వ తేదీ వరకు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీడియో ప్రసంగం ద్వారా గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. కేవం బడ్జెట్‌ ఆమోదం కోసమే ఈ సమావేశాు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్‌, సీఎం
కార్యాయాను నిషేధిత ప్రాంతాుగా గుర్తించారు. అనుమతి లేకుండా ఎవరనీ రానివ్వకూడదని అధికాయి నిర్ణయించారు. అసెంబ్లీ సెక్రటేరియట్‌ జారీ చేసే పాసు తప్పనిసరని, ఇవి లేకుండా ఎమ్మెల్యేు, ఎమ్మెల్సీ వాహనాకు అనుమతి లేదని అధికాయి పేర్కొన్నారు. అదే విధంగా చట్ట సభ సభ్యు వారికి నిర్దేశిరచిన మార్గంలోనే వెళ్లాని అధికాయి సూచించారు. కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో నిషేధాజ్ఞ మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అసెంబ్లీ బ్జడెట్‌ సమావేశాు నిర్వహించనున్నారు.
బ్జడెట్‌ను ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాు నిర్వహిస్తున్నామని ఛీప్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలి సభ్యుందరూ వారి వారి జిల్లాలోనే కోవిడ్‌ పరీక్షు చేయించుకుని రావాని విజ్ఞప్తి చేస్తున్నామని...దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాు ఇచ్చామని ఆయన చెప్పారు. శాసనసభ, మండలి సభ్యు మాత్రమే సభా ప్రాంగణంలోకి రావాని కోరారు. పీఏు, పీఎస్‌ను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దేశంలోనే ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్‌ రాజ్‌భవన్‌ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తారని తెలిపారు. ప్రతి నాుగు గంటకు ఒకసారి అసెంబ్లీ ప్రాంగణాన్ని పూర్తి స్థాయిలో శానిటైజ్‌ చేస్తారని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సభ్యు ఎవరైనా కోవిడ్‌ `19 పరీక్షు చేయించుకునేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని.. ఆహార పదార్థాు ఏర్పాటు చూసే 40 మందికి ఇప్పటికే కోవిడ్‌ `19 పరీక్షు నిర్వహించి నెగెటివ్‌ వచ్చిన వారితో మాత్రమే భోజనాు తయారు చేయిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణానికి బయట టెంట్లు ఏర్పాటు చేసి భౌతికదూరం పాటించేలా భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విూడియాకు ఈ సెషన్‌లో సభకు అనుమతి లేదని... విూడియా కోసం విజయవాడలోని ఆర్‌అండ్‌బి భవన్‌లో అసెంబ్లీ సమావేశా ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాంత్‌రెడ్డి వ్లెడిరచారు.