లాస్‌ ఏంజిల్స్‌లో యోగా వర్సిటీ

న్యూయార్క్‌,జూన్‌24(జ‌నంసాక్షి ): అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో.. వివేకానంద యోగా యూనివర్సిటీని ప్రారంభించారు. ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వర్సిటీని స్టార్ట్‌ చేశారు. భారత్‌లో కాకుండా ఇతర దేశాల్లో యోగా యూనివర్సిటీని ప్రారంభించడం ఇదే మొదటిసారి. సనాతన యోగా విధానానికి.. శాస్త్రీయ, ఆధునిక పద్దతును జోడిరచి.. ఆ యూనివర్సిటీలో యోగా పాఠాు చెప్పనున్నారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్‌, విదేశాంగశాఖ స్టాండిరగ్‌ కమిటీ చైర్మపర్సన్‌ పీపీ చౌదరీు.. వర్చువల్‌ సమావేశం ద్వారా వివేకానంద యోగా యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్‌లోని భారతీయ రాయబార కార్యాయంలో నిర్వహించారు.
సోదరభావం గురించి అమెరికా నుంచే వివేకానంద సందేశం ఇచ్చారని, భారత్‌ మినహా ఇతర దేశాల్లో యోగా వర్సిటీని మొదుపెట్టడం ఇదే తొలిసారి అని, అమెరికా నుంచి యోగా సందేశం ప్రపంచదేశాకు అందుతుందని మంత్రి మురళీధరన్‌ తెలిపారు. ప్రఖ్యాత యోగా గురువు డాక్టర్‌ హెచ్‌ఆర్‌ నాగేంద్ర.. వివేకానంద యోగా యూనివర్సిటీకి తొలి చైర్మన్‌గా ఉంటారు. 1983లో షికాగోలో స్వామి వివేకానంద భారతీయ యోగా ప్రాశస్త్యాన్ని తన ప్రసంగం ద్వారా తెలియజేసినట్లు యోగా గురువు నాగేంద్ర తెలిపారు. తూర్పు, పశ్చిమ దేశా ఉత్తమ విధానాన్ని వర్సిటీలో నేర్పనున్నట్లు ఆయన వ్లెడిరచారు.