పోస్టు పెడితే కేసులా?

సర్కార్‌ తీరుపై దేవినేని మండిపాటు
అమరావతి,జూన్‌24(జ‌నంసాక్షి): పోస్టు పెడితే కేసు.. మాట్లాడితే నోటీసు, ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా? అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛ లేదా? అని ప్రవ్నించారు. సోషల్‌ విూడియాలో విమర్శను ఫార్వర్డ్‌ చేస్తే అరెస్టు చేస్తారా? పోస్టుపెడితే కేసు, మాట్లాడితే నోటీసు, ప్రశ్నిస్తే అరెస్టు. రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛలేదా? టీడీపీ మహిళా నేత పట్ల అసభ్యంగా పోస్టు పెట్టిన విూ పార్టీ కార్యకర్తపై ఎందుకు చర్యు తీసుకోవడంలేదో సమాధానం చెప్పండి జగన్‌ గారు అని దేవినేని ఉమ ట్వీట్‌లో ప్రశ్నించారు.