అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి


ప్రపంచం మొత్తం పెనుప్రమాదకర దశలో ఉంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
జెనీవా,జూన్‌20(జ‌నంసాక్షి): కరోనా వైరస్‌ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోందని, ప్రస్తుతం ప్రపంచం మొత్తం పెను ప్రమాదకర దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. గురువారం ఒక్కరోజే 1,50,000 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదుకావటం, అందులో సగానికి పైగా అమెరికాలోనివి కావటంపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గేబ్రియేసస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన కార్యాయంలో ప్రపంచవ్యాప్త కరోనా పరిస్థితుపై ఆయన మాట్లాడారు. వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టడం అసాధ్యం కానప్పటికి అదో కష్టతరమైన ప్రయాణమని అన్నారు. అవసరమైన విధంగా లాక్‌డౌన్‌ను ఉపయోగించుకోవాని, క్రమంగా.. ఎప్పటికప్పుడు కరోనా వివరాను సేకరిస్తూ ఉండాన్నారు. వైరస్‌ వ్యాప్తి అవకాశాను గుర్తించకపోతే అది విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 87క్షకు పైగా కరోనా కేసు నమోదవ్వగా, 4,62,525 మంది మృత్యువాత పడ్డారు. లాక్‌డౌన్‌తో ప్రజు విసుగెత్తిపోయారని..దీంతో కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగు పెట్టిందని డబ్లూహెచ్‌ఓ హెచ్చరించింది. ’ప్రస్తుతం ప్రపంచం కొత్త ప్రమాదకర దశలోకి అడుగుపెట్టింది. లాక్‌ డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజ విసిగెత్తిపోయారు. అయితే వైరస్‌ ఇప్పటికీ వెగంగా వ్యాప్తిస్తోంది’ అని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ట్రెడ్రోస్‌ వ్యాఖ్యానించారు. లాక్‌ డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టం జరుగుతున్నప్పటికీ ఈ మహ్మమారి వ్ల ఇప్పటికీ పెను ప్రమాదం పొంచి ఉందని ఆయన
హెచ్చరించారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి మరి కొన్ని నెల పట్టే అవకాశం ఉన్నందుకు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచంలో దాదాపు 4.5 క్ష మంది కరోనాకు బలైపోయిన విషయం తెలిసిందే. మొత్తం 80.5 క్ష మంది ఈ వ్యాధికి సోకినట్టు తాజాగా లెక్కు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. కరోనా నుంచి కోుకుంటున్న ఐరోపా దేశాు ఆంక్షు సడలిస్తున్నాయి. అయితే ఆంక్ష ఎత్తేస్తున్న ఆసియా దేశాల్లో మాత్రం కరోనా కేసు వేగంగా పెరుగుతున్నాయి.