ఆడబిడ్డలపై దారుణాలు దేశానికే అవమానం

- నోబెల్‌ గ్రహీత కైలాష్‌ సత్యార్థి ఆవేదన 
దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి):దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నోబెల్‌ పురస్కార గ్రహీత కైలాష్‌ సత్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాలు యావత్‌ దేశానికే అవమానకరమన్నారు. ఇలాంటి ఘటనల్లో మహిళలు, చిన్నారులు న్యాయపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, దీనికి వెంటనే చరమగీతం పాడాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో చోటుచేసుకున్న ఘటనపై స్పందించిన సత్యార్థి.. 'దేశవ్యాప్తంగా ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలు భారత్‌కు అవమానకరంగా మారుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రిని నేను అభ్యర్థించేది ఒక్కటే.. యావత్‌ దేశం విూ వైపు చూస్తోంది. మన కుమార్తెలకు విూ అవసరం ఉంది. అత్యాచారాలపై యుద్ధం ప్రకటించండి. విూ వెంట మేమంతా ఉంటాం' అని అన్నారు. ఆడపిల్లలకు కాపాడుకోవడంలో మనం విఫలమవుతున్నామని సత్యార్థి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.