అహ్మద్‌ పటేల్‌కు కరోనా పాజిటివ్‌

దిల్లీ,అక్టోబరు 1(జనంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా వైరస్‌ సోకినట్టు ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. దిల్లీలోని తన నివాసంలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు పేర్కొన్నారు.''నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు స్వీయ నిర్బంధంలోకి ఉండాలి' అని సూచించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు అభిషేక్‌ సింఘ్వి మను, తరుణ గొగోయ్‌, డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య తదితరులు కొవిడ్‌ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.