టెన్త్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు


మహబూబ్‌నగర్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన యూట్యూబ్‌-ఆన్‌లైన్‌ తరగతులను ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌  ప్రారంభించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వెంకటరావు, డీఈవో ఉషా రాణి, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, కృష్ణ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.