బోగస్‌ లేఖ సృష్టించిందే సిఎం కెసిఆరే


లేఖపై దర్యాప్తు చేసి నిజాలు తేల్చాలి


లేకుంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలి


గ్రేటర్‌లో బిజెపి గెలిస్తే వరద బాదితులకు 25 వేలు ఇస్తాం


విూడియా సమావేశంలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌


హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల సంఘానికి తాను లేఖ రాసానని అంటున్న కెసిఆర్‌ చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని బిజెపి తెలంగాణ అద్యక్షుడు సవాల్‌ చేశారు. తాను శుక్రవారం మధ్యాహ్నం ఆలయం వద్దకు వస్తానని, నిజమైన హిందువు అయితే కెసిఆర్‌ రావాలన్నారు.


తనపేరుతో లేఖ సృష్టించి వరదసాయాన్ని నిలిపివేయించిన కెసిఆర్‌ అబద్దాల పుట్ట అన్నారు. పార్టీ నాయకులు డికె అరుణ, ఎంపి సోయం బాపూరావు తదితరులతో కలసి ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో విూడియాతో మాట్లాడారు.గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరద బాధితులకు ఇంటికి రూ.25 వేలు ఇస్తామన్నారు. ఎంత నష్టం వస్తే అంత లెక్క గట్టి ఇస్తామన్నారు. నష్టపోయిన కార్లు, బైక్‌ లు ఇప్పిస్తామన్నారు. తన లేఖకు సంబంధించి విచారణచేయించాలని, లేకుంటే కేసీఆర్‌ చార్మినార్‌ బాగ్యలక్ష్మి


ఆలయం వద్దకు రావాలని బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. తాను వరద సాయం ఆపానని కేసీఆర్‌ నిరూపించాలన్నారు. వరద సాయం ఆపలేదని తాను అమ్మవారిపై ప్రమాణం చేస్తానన్నారు. కేసీఆర్‌ ప్లాన్‌ ప్రకారమే తన పేరుతో లేటర్‌ రాయించారన్నారు. ఒక జాతీయ పార్టీ లేఖనే ఫోర్జరీ చేశారంటే... ఇక ప్రజల ఆస్తులకు భరోసా ఏంటి అన్నారు. కేసీఆర్‌ నిజంగా హిందువైతే.. నకిలీ లేఖపై ప్రమాణం చేయడానికి రేపు 12 గంటలకు ఆయన చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణానికి రావాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలి' అని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. 'కేసీఆర్‌ దేశ ద్రోహి.. ఆయనకి ఇంగితజ్ఞానం లేదు. భాగ్యనగరం దేశభక్తుల అడ్డా అన్నారు. బీజేపీ కార్యకర్తలు డ్రెస్సులు లేని ఖాకీలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్‌ వ్యాఖ్యలు దారుణం.. ప్రధానిని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుంది. ఎన్నికల్లో గెలవగానే ఆ ఫ్రంటూ.. ఈ ఫ్రంటూ అన్నారు. చివరకు టెంటు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ దుకాణం మొదలుపెట్టారు. రాష్ట్రంలో హిందువులను ఉండనిస్తారా లేదా అన్న ఆందోళన ఉందని, కేసీఆర్‌ ఎంఐఎంకి వత్తాసు పలుకుతున్నారు. రేపటి నుంచి కేసీఆర్‌ చరిత్ర బయటపెడతాం. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా' అంటూ బండి సంజయ్‌ సవాలు విసిరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని మేయర్‌ చేస్తే.. ప్రతి ఇంటికి 25 వేల రూపాయలు ఇస్తాం. వరద నష్టం అంచనా వేసి... నష్టాన్ని పూరిస్తాం. ప్రజల ఆస్తులకు భరోసా లేదన్నారు.'పింకీలు అంతా మంకీలే. తెలంగాణలో కచరాను సాఫ్‌ చేయాలని అనుకుంటున్నాం. పెడితే పెళ్లి కోరుతారు... లేకుంటే చావు కోరుతారు. 6 ఏళ్లలో టీఆర్‌ఎస్‌ ఏం చేసిందో చెప్పాలి. టీఆర్‌ఎస్‌ గత ఎన్నికల మ్యానిఫెస్టో వెబ్‌సైట్‌లో లేకుండా చేసినా.. మా దగ్గర ఉంది. బీజేపీ 370 ఆర్టికల్‌ రద్దు చేసింది. రామ మందిర నిర్మాణం చేపట్టింది. సీఏఏ అమలు చేశాం. ముస్లిం మహిళలను కాపాడటానికి ట్రిపుల్‌ తాలక్‌ని రద్దు చేశాం. హరితహారం, రైతు వేదికకు కేంద్రమే నిధులు ఇచ్చింది' అన్నారు సంజయ్‌. సీఎం కేసీఆర్‌ కు బీజేపీ భయం పట్టుకుందన్నారు. కేసీఆర్‌ ను చూసి తెలుగు ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. చాయ్‌ పే చర్చా కాక.. మందు పే చర్చా పెట్టమంటావా? అని కేసీఆర్‌ ను ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫోటో పెట్టి మందు పే చర్చ పెడ్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్‌ కు వైన్లు, బార్లే మిగులుతాయ న్నారు. హిందు దేవాలయాలపై దాడులు కేసీఆర్‌ కు కనపడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌.. హైదరాబాద్‌ ను ఎంఐఎంకు అప్పగించాలనుకుంటున్నావా? అని అన్నారు. కేసీఆర్‌ పక్కా దేశ ద్రోహి అన్నారు. తెలంగాణలో హిందువుల్ని బతకనివ్వవా కేసీఆర్‌ అనిప్రశ్నించారు. ఎవరి ఓట్ల కోసం కేసీఆర్‌.. దేశాన్ని తక్కు చేసి మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. దేశాన్ని తక్కువ చేసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నావా అని కేసీఆర్‌ ను ప్రశ్నించారు. హావిూలు నెరవేర్చుంటే మేనిఫెస్టో ఎందుకు డిలీట్‌ చేశారన్నారు. బీజేపీ మేయర్‌ ను గెలిపించాలన్నారు.