చత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌

 



- మావోయిస్టు మృతి.

మహాదేవపూర్‌, జనవరి 13 (జనంసాక్షి): సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్గడ్‌లో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతున్నది. దీంతో తెలంగాణ సరిహద్దుల్లోని కాలేశ్వరం మహాదేవపూర్‌, పలిమెల, ఎటూరునాగారం, వాజేడు, చర్ల శ్‌ తదితర పోలీస్‌ స్టేషన్లు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూనే ఉన్నాయి. చత్తీస్గడ్‌ రాష్ట్రం దంతేవాడ జిల్లాలోని కటే కళ్యాణ్‌ అడవి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు మృతి చెందినట్లు తెలిసింది. భూపాలపల్లి జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి చత్తీస్ఘడ్‌ రాష్ట్రం దంతేవాడ జిల్లాలోని కాటే కళ్యాణ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్నటువంటి మజూమ్‌ అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులకు మధ్య లో 45 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. మావోయిస్టు మరియు పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు మృతి చెందినట్లు సమాచారం. గత రెండు రోజుల క్రితం కాటే కళ్యాణ్‌ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తినీ మావోయిస్టులు తీవ్ర చిత్రహింసలకు గురి చేసి తిరిగి గ్రామంలో వదిలిపెట్టడంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజులుగా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కొరకు గాలిస్తున్న క్రమంలో మంగళవారం రోజున పోలీసులకు 3 మందుపాతరలు లభ్యం కావడంతో తో డి ఆర్‌ ఎస్‌ బి టి ఎఫ్‌ జవాన్లు మజూమ్‌ అటవీ ప్రాంతంలో మరింత విస్తృతంగా కూంబింగ్‌ చేపట్టారు. భారీగా ఉన్న మావోయిస్టులు పోలీసుల రాకను గమనించి పోలీసులపై కాల్పులు జరపడంతో పోలీసు జవాన్లు తిరిగి మావోయిస్టులపై కాల్పులు జరిపారు. పోలీసులు మావోయిస్టుల మధ్య 45 నిమిషాల పాటు జరిగినటువంటి కాల్పుల్లో కటే కళ్యాణ్‌ ఏరియా కమిటీ సభ్యుడు మావోయిస్టు మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. సంఘటన స్థలంలో లో 19 ఎమెం రివాల్వర్‌ తో పాటు నిత్యావసర సరుకుల బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు పెద్దఎత్తున విధ్వంసం సృష్టించేందుకు మజూమ్‌ అటవీ ప్రాంతంలో మకాం వేసి సన్నాహాలు చేస్తున్నట్లు పోలీసులు ఊహిస్తున్నారు. ఈ ప్రాంతంలో దొరికిన మూడు మందు పాతరలు లభించాయి. ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రంలో నూతన సంవత్సరంలో ఇదే మొదటి ఎన్కౌంటర్‌ ఈ ఎన్కౌంటర్లో ఐదు లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతిచెందడంతో పోలీసు యంత్రాంగం ఉత్సాహం ముందుకు వేస్తున్నారు.