ఎమ్ఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు


 హైదరాబాద్‌: సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోని ఎమ్‌ఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌ పరిశ్రమ కార్యాలయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్‌ఎస్‌ఎస్‌ ఫార్మా కంపెనీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అనుమానంతో సుమారు 30 ఐటీ బృందాల పర్యవేక్షణలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోదాల్లో హైదరాబాద్‌ ఐటీ అధికారులతో పాటు విజయవాడ, విశాఖపట్నం, ఒడిశా, కోల్‌కతా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు పాల్గొన్నారు. ఈ పరిశ్రమతో పాటు దాని అనుబంధ సంస్థల్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.