అలాంటిదేమీలేదు:కిషన్‌రెడ్డి

 



 

హైదరాబాద్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి):

తాము ప్రాంతాన్నీ కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోమని.. హైదరాబాద్‌ సహా అన్ని నగ రాలను కేంద్రం అభివృద్ధి చేస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్ర మాదం ఉందని ఎంపీ అసదు ద్దీన్‌ ఓవైసీ పార్లమెంటులో అ న్నారని.. అయితే దానిపై సమాధానం చెప్పేలోపే ఓవైసీ సభ నుంచి బయటకు వెళ్లిపోయారని వెల్లడించారు. ఎంఐఎం పార్టీ మద్దతుతోనే మేయర్‌ పీఠాన్ని తెరాస దక్కిం చుకుందని కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహిం చిన హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశా నికి ఎమ్మెల్సీ రామచంద ర్‌రెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై కిషన్‌రెడ్డి మాట్లాడారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలు భాజపా గెలవడం ఖాయమన్నారు.తెలంగాణ అమరవీరుల ఆత్మ ఘోషించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరి ఉందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీ అంశాన్ని సీఎం కేసీఆర్‌ తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ఏడేళ్లుగా ఉపాధ్యాయ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు.