డెహ్రడూన్, మారి ్చ9 (జనంసాక్షి): ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేం ద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. పార్టీ ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని అనుకుంటున్న సమయంలో ఆయనే రాజీనామా చేసి పార్టీకి అవకాశం లేకుండా చేశారు. ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ, రాష్ట్రానికి సేవ చేయడానికి మరొకరికి అవకాశం ఇవ్వడానికి పార్టీ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం మంగళవారం ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు ఊహించని అవకాశాల్ని పార్టీ ఇచ్చిందని, నిజానికి ముఖ్యమంత్రి పదవి తనకు లభించిన బంగారు అవకాశమని అన్నారు. అయితే పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉం దని ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు సేవ చేయడానికి నాకు బంగారు అవకాశం లభించింది. ఇలాంటి అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిని చేసి,సేవా బాధ్యతలను వారికి అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ ఆదేశాలను పాటించాలని త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన 20 ఏళ్లలో కాంగ్రెస్ స్టాల్‌వార్ట్ నారాయణ్‌దత్ తివారీ ఒక్కరే ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగారు. ఈ నెల 17 నాటికి రావత్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి నాలుగేళ్లు అవుతుంది. అయితే, ఆలోపే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు 8 మంది.. నిత్యానంద్ స్వామి, బీఎస్ కోష్యారీ, ఎన్‌డీ తివారీ, మేజర్ జనరల్ (రిటైర్డ్) బీసీ ఖండూరీ, రమేశ్ పోఖ్రియాల్ నిష్యంక్, విజయ్ బహుగుణ, హరీశ్ రావత్, త్రివేంద్రసింగ్ రావత్‌లు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే సీఎంగా రావత్ కొన్ని రికార్డులను తన పేర లిఖించుకున్నారు. రాష్ట్ర బ్జడెట్‌ను ఐదుసార్లు ప్రవేశపెట్టిన రెండో ముఖ్యమంత్రిగా రావత్ రికార్డులకెక్కారు. ఐదేళ్ల పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయిన ముఖ్యమంత్రుల జాబితాలో చేరారు.