ఢిల్లీ పాఠశాలలకు స్పెషల్‌ బోర్డ్‌:అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయందిల్లీ మార్చి 6 (జనం సాక్షి):  స్కూళ్ల విష యంలో అరవింద్‌ కేజ్రీ వాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఉన్న పాఠశాలలన్నిం టినీ ఒకే బోర్డు పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో కొత్త స్కూల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. నగరంలో ఉన్న దాదాపు 2,700 స్కూళ్లు కొత్తగా ఏర్పాటు చేయబోయే దిల్లీ బోర్డు ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (డీబీఎస్‌ఈ) పరిధిలోకి రానున్నాయి. 2021-22లో తొలుత ప్రభుత్వ స్కూళ్లు.. రాబోయే నాలుగైదేళ్లలో మిగతా అన్ని స్కూళ్లూ ఈ బోర్డులోకి తీసుకురాను న్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం వెల్లడించారు.ప్రస్తుతం దిల్లీ పరిధిలో సుమారు వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు, 1700 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే స్కూల్‌ బోర్డుకు పాలకమండలి అధ్యక్షుడిగా దిల్లీ విద్యాశాఖ మంత్రి వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్‌ బాడీకి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నేతృత్వం వహించనున్నారని కేజ్రీవాల్‌ తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం, నిస్వార్థంగా దేశానికి, సమాజానికి సేవ చేయా లనే దృక్పథం అలవాటు చేయాలన్నదే డీబీఎస్‌ఈ లక్ష్యమని వివరించారు.