18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌


క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టిన భారత్‌ బయోటెక్‌

ముంబై,జూన్‌7(జనం సాక్షి):  కరోనా థర్డ్‌ వేవ్‌ చిన్నపిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో కీలక ముందడుగుపడిరది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ 18 ఏళ్ల లోపు వారిపై ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఈ పరీక్షలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి డీజీసీఐ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ ఆస్పత్రిలో క్లినికల్‌ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే 12 నుంచి 18 ఏళ్ల పిల్లల రక్తనమూనాలను సేకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 50 మంది వాలంటీర్లను పరిశీలించినట్లు పేర్కొన్నాయి. రక్తనమూనాల నివేదికలు అందిన తర్వాత వారికి టీకా ఇవ్వనున్నట్లు వెల్లడిరచాయి. మరోవైపు ఢల్లీి ఎయిమ్స్‌లో చిన్న పిల్లలపై కొవాగ్జిన్‌ క్లినికల్‌ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కొవాగ్జిన్‌, కోవిసీల్డ్‌, స్పుత్నిక్‌ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చిన్న పిల్లలకు వేసేందుకు ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదు.