లోపభూష్టంగా కేంద్ర వ్యాక్సినేషన్‌ విధానం !

 దేశాల వ్యాక్సిన్‌ ప్రక్రియ తీరుపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్రం అనుసరిస్తున్న తీరుతో రాష్ట్రాలకు సకాలంలో వ్యాక్సిన్‌ అందడం లేదు. దీంతో వ్యాక్సిన్‌ కారణంగా ప్రజల్లో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రతిష్ట పాలవుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలను ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతె ఆయా రాష్ట్రాలు కేంద్రంపై దండయాత్ర చేస్తున్నాయి. కేంద్ర విధానాలు రాష్ట్రాలకు శాపంతగా మారిందని తెలంగాణ మంత్రులు కెటిఆర్‌, హరీష్‌ రావులు విమర్శించారు. అలాగే పలు రాష్ట్రాలు కూడా విమర్శలకు పదను పెడుతున్నాయి. హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ ఉత్పత్తి అవుతున్నా తమకు అందడం లేదని తెలంగాణ పాలకులు విమర్శ చేస్తున్నారు. ఇకపోతే దేశంలో నిరక్షురాస్యులు, ఇంటర్‌నెట్‌ అంటే తెలియని వారు ఉన్నారు. వారంతా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవడం సాధ్మమేనా అన్నది కేంద్రం ఆలోచించడం లేదు. నేరుగా గ్రామాలకు వెళ్లి వ్‌ఆయక్సిన్‌ వేస్తే తప్ప మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్‌ అందదని తేలిపోయింది. ఇకపోతే విదేశాల నుంచి దిగుమతి చేసుకుందామని గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించినా కేంద్ర విధానాల వల్ల సాధ్యం కావడం లేదు. దీంతో కనీసం ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని కోరుతున్నారు. ఎపి కూడా గ్లోబల్‌ టెండర్లు పిలిచినా సాధ్యం కాకకపోవడంతో మిన్నకుండి పోయింది. నిజానికి వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం పెద్దగా స్పందన లేకుండా ఉంది. ఆన్‌లైన్‌లో నమోదు అన్నది భారత్‌ లాంటి దేశంలో సాధ్యం కాదన్న విషయం గుర్తించడం లేదు. సుప్రీం కోర్టు కూడా దీనిపై ప్రశ్నలు కురిపించినా కేంద్రం నుంచి సమాధానం రావడం లేదు. ప్రస్తుతం లాక్‌డౌన్‌, ఇతర కారణాల వలన వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గు ముఖం పట్టినప్పటికీ ఇప్పటికే లెక్కలేనంత మందిని వైరస్‌ ప్రాణాలను బలిగొంది. ఈ సెకండ్‌ వేవ్‌ పూర్తిగా ముగియక ముందే ధర్డ్‌ వేవ్‌ గురించి చర్చలు, భయాందోళనలు మొదలయ్యాయి. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు పలు విధాలుగా ప్రభుత్వాలకు హెచ్చరికలు, సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ మహమ్మారి బారినుండి బయటపడేందుకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని వైద్యులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. వైద్య నిపుణుల అంచనా ప్రకారం దేశంలో కనీసం 95 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేస్తేనే హెర్డ్‌ ఇమ్యూనిటీ ఏర్పడే అవకాశం లేదని అంటున్నారు. దేశంలో కోవిడ్‌ అదుపు లోకి వచ్చే అవకాశం అప్పుడే వస్తుందని అభిప్రాయపడుతున్నారు. హర్డ్‌ ఇమ్యూనిటీ వస్తే వైరస్‌ ఎంతగా వ్యాపించినా పెద్దగా ప్రభావం చూపదని అంటున్నారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించిన నివేదికలో జులై చివరకు నెలకు 13కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అయ్యేలా చూస్తామని పేర్కొన్నది. వ్యాక్సిన్‌ డ్రైవ్‌ వేగాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్న డిమాండ్‌ దేశంలో పెరుగుతోంది. టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్‌ ను ఉత్పత్తి చేయగల ఇతర సంస్ధలు ఉన్నాయి. అవసరమైతే కోవాక్సిన్‌ మేధోసంపత్తి హక్కులను సవరించి మిగతా సంస్ధలు ఉత్పత్తి చేయగల్గేలా చర్యలు తీసుకోవాలని రాజకీయా పార్టీలు, ముఖ్యమంత్రులు కోరుతున్నారు. దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయగల నేపథ్యం ఉన్న పనేషియా బయోటెక్‌, సనోఫి`శాంతా బయోటెక్‌, బయోలాజికల్‌`ఇ, హెస్టర్‌ బయోసైన్సెస్‌, జైడస్‌ కాడిలా వంటి సంస్ధల్ని భాగస్వాముల్ని చేసి దేశీయ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సంస్ధల అన్ని రకాల వ్యాక్సిన్ల మొత్తం ఉత్పత్తి సామర్ధ్యం సాలీనా 8.2 బిలియన్లుగా ఉన్నది. కనుక కోవిడ్‌`19 వ్యాక్సిన్ల ఉత్పత్తిలో తక్షణమే ఈ సంస్ధల్ని భాగస్వాముల్ని చేసే చర్యలు చేపట్టాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. విదేశాల నుండి వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించిన బేరసారాల పక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా సాధ్యమైనంత అధిక

సంఖ్యలో వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవాలి. అలాగే విదేశీ వ్యాక్సిన్‌ సంస్ధలు తమ వ్యాక్సిన్లను మన దేశంలోని సంస్ధల భాగస్వామ్యంతో ఉత్పత్తి చేసేందుకు జరుపుతున్న సంప్రదింపులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ పక్రియ వేగంగా, నిరాటంకంగా కొనసాగేందుకు స్ధానికంగా దేశీయ టీకాల ఉత్పత్తి పెంచడం, విదేశీ వ్యాక్సిన్ల లభ్యత పెంచుకోవడం వంటి చర్యలతో పాటు ప్రభుత్వం మరికొన్ని చర్యలు చేపట్టాల్సి వుంది. సామాన్య ప్రజలలో వ్యాక్సినేషన్‌ పట్ల ఉన్న అపోహలు, భయాలు తొలగించి, సంసిద్ధత పెరిగేలా వివిధ పద్ధతులలో అవగాహన కల్గించాలి. వ్యాక్సిన్‌ ను కేంద్ర ప్రభుత్వమే గ్లోబల్‌ టెండర్ల ద్వారా కొనుగోలు చేసి రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు అందిం చాలని ఆయా రాష్ట్రాల సిఎంలు కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. వ్యాక్సిన్‌ ధరల్లో వ్యత్యాసాలను తొల గించాలని, కేంద్రమైనా, రాష్టాలైన్రా ఒకే ధరకు లభ్యమయ్యేలా విధానం రూపొందించాలని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కోరుతున్నారు. ఇకపోతే వ్యాక్సిన్‌ ఉత్పత్తి కోసం సామర్ధ్యం ఉన్న సంస్ధలకు అవసరమై నంత బడ్జెట్‌ ఉదారంగా,సత్వరమే కేటాయించాలి. దేశవ్యాప్తంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలి. సత్వర, సమగ్ర వ్యాక్సినేషన్‌ పాలసీ అమలు ద్వారా మాత్రమే కోవిడ్‌`19 కలుగజేసే తదుపరి పరిణామాలను ఎదుర్కొని మహమ్మారికి అడ్డుకట్ట వేయగలమని ప్రపంచ నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. తాజాగా భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తిని ఇతర సంస్థలకు ఇవ్వాలని దేశంలో డిమాండ్‌ పెరుగుతోంది. అప్పుడే కోవాగ్జిన్‌ ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుందని పలు పార్టీల నేతలు కోరుతున్నారు. ఈలోగా వైరస్‌ మ్యుటేషన్‌ చెందుతూ మరింత వేగంగా వ్యాపిస్తూ, మరింత తీవ్రత కల్గిన వ్యాధిగా పరిణమించే అవకాశం ఉన్న కోవిడ్‌`19 మూడవ, నాల్గవ వేవ్‌లు ప్రజల ముందున్న పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో కేందప్రభుత్వం జోక్యం చేసుకుని స్ధానికంగా ఉత్పత్తి చేయబడ్డ వ్యాక్సిన్లు మన దేశ అవసరాలు తీరేదాకా ఎగుమతి చేయకుండా నిషేధించాలి. అయితే కేంద్రం నిర్ణయం మేరకు ఇది ఆధారపడి ఉంటుంది.