ఆటోను ఢీకొన్న బైక్‌: వ్యక్తి మృతి

విజయవాడ,జూన్‌7(జనం సాక్షి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం పెడన మండలం బంటుమిల్లిరోడ్డు సింగరాయపాలెం ప్రాంతం వద్ద చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా పెడన మండలం జాతీయ రహదారి 216 బంటుమిల్లిరోడ్డు సింగరాయపాలెం ప్రాంతం వద్ద ఆటోను ఓవర్‌టేక్‌ చేయబోయిన బైక్‌, ఆటోను ఢీకొంది. బైక్‌ పై ఉన్న వ్యక్తి కిందపడ్డాడు. అతని వెనుకే వస్తున్న టాటా ఎఐసి వాహనం రోడ్డుపై పడిన వ్యక్తి తలనెక్కడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, టాటా ఎఐసి వాహనంలో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పెడన పోలీసులు చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి బందరు మండలం మంగినపూడి శివారు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.