ఒకరి పరిస్థితి సీరియస్..ఉస్మానియాకు తరలింపు
హైదరాబాద్,జూన్7(జనం సాక్షి):
నగరంలోని డబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్వల్ప వివాదం కారణంగా రెండు బృందాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. వీరిలో ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఘటనాస్థలిలోనే కుప్పకూలిపోయాడు. గాయపడిన యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘర్షణ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.