జిల్లాలో అధికారుల ఉరుకులు పరుగులు

 


పాఠశాలలను సన్నద్దం చేసే పనిలో విద్యాశాఖ
నిర్మల్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): సెప్టెంబరు 1 నుండి అన్ని పాఠశాలలు ప్రారం భించనున్నందున స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. కొవిడ్‌ కారణంగా పాఠశాలలు తిరిగి 16 నెలల తర్వాత సెప్టెంబరు 1 నుండి ప్రారంభించనున్నారు. విద్యార్థు లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని అధికారులు అన్నారు. పాఠశాలల్లో ప్రతితరగతి గదిని ఫర్నిచర్‌ను శుభ్రపరచాలని అన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లను శుభ్రం చేయించాలని అన్నారు. పాఠశాలల్లోని కిచెన్‌షెడ్లను ప్రత్యేకంగా శుభ్రం చేయించాలని అన్నారు. ప్రతీ పాఠశాలకు మిషన్‌ భగీరథ ద్వారా నల్లానీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతీవిద్యార్థి తప్పనిసరిగా మాస్కులు ధరించి పాఠశాలలకు రావాలని, భౌతికదూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రైవేట్‌ పాఠశాల్లో కూడా పారిశుద్ధ్య పనులు చేపట్టేలా జిల్లా విద్యాశాఖాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠ శాలల బస్సుల్లో విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసు కోవాలని అన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పారిశుద్ధ్య చర్యల బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలదేనని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నెలాఖరులోగా అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వి హంచి ప్రారంభానికి సిద్ధంగా ఉంచినట్లు డీఈవో ప్రణీత తెలిపారు.