14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌


` హైదరాబాద్‌లో కుండపోత..
` జనజీవనం అతలాకుతలం
` భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
` ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దని అధికారులకు ఆదేశాలు
` ఏ సమస్య ఉన్నా 100కు ఫోన్‌ చెయ్యండి
` హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ విజ్ఞప్తి
హైదరాబాద్‌,సెప్టెంబరు 27(జనంసాక్షి):గులాబ్‌ తుపాను ప్రభావం తెలంగాణపై పడుతోంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్‌, జనగామ, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్‌, కుమరంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ నాగరత్న తెలిపారు.
తుపాను ప్రభావంతో హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని వనస్థలిపురం, ఎల్బీనగర్‌, నాగోల్‌, మన్సూరాబాద్‌, బీఎన్‌రెడ్డి నగర్‌, తుర్కయాంజాల్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, కోఠి, సుల్తాన్‌ బజార్‌, బేగంబజార్‌, నాంపల్లి, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, నారాయణగూడా, హిమాయత్‌నగర్‌, లక్డికాపూల్‌, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడిరది. లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, గుడిమల్కాపూర్‌, మెహదీపట్నం, చార్మినార్‌, చంద్రాయానగుట్ట, బహదూర్‌పురా, యకుత్‌పురా తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది.బొరబండ, అల్లాపూర్‌, మోతీ నగర్‌, ఎర్రగడ్డ, సనత్‌ నగర్‌, ఈఎస్‌ఐ, వెంగల్‌ రావు నగర్‌, రహమత్‌ నగర్‌, అవిూర్‌పేట, మైత్రివనం, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, అల్విన్‌ కాలనీ, నిజాంపేట్‌, ప్రగతి నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడిరది భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కిలోవిూటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. జూబ్లీహిల్స్‌`హైటెక్‌ సిటీ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జాం అయింది.
ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు: కేసీఆర్‌
గులాబ్‌ తుపాను నేపథ్యంలో భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌తో తాజా పరిస్థితులపై సీఎం సవిూక్షించారు. గులాబ్‌ తూపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని.. ఈ పరిస్థితుల్లో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మరోసారి జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జ తదితరులతో సీఎస్‌ సవిూక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు.జిల్లాల్లో రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌, నీటి పారుదల, అగ్నిమాపక శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే హైదరాబాద్‌, కొత్తగూడెం, వరంగల్‌ జిల్లాల్లో ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఉపయోగించుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టరేట్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం సచివాలయంలోని కంట్రోల్‌ రూంకు అందించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులు, వంతెనెల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులు సవిూక్షించాలన్నారు.
ఏ సమస్య ఉన్నా డయల్‌ 100: హైదరాబాద్‌ సీపీ విజ్ఞప్తి
మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ హెచ్చరించారు. నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. ఎలాంటి సమస్య ఉన్నా డయల్‌ 100కి ఫోన్‌ చేయవచ్చని సూచించారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాలు, కాలనీపై దృష్టిపెట్టినట్టు చెప్పిన ఆయన.. పోలీస్‌ సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా ఇద్దరు అధికారులతో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలాంటి సాయం కోసమైనా హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 040`23202813ను సంప్రదించాలని సూచించారు.
(భారీవర్షాల నేపథ్యంలో నేడు సెలవు
` ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం)
హైదరాబాద్‌,సెప్టెంబరు 27(జనంసాక్షి):రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చింది. భారీ వర్షాల దృష్ట్యా సీఎం కేసీఆర్‌ సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఢల్లీిలో సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సవిూక్ష నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవులు ప్రకటిస్తున్నటుల్‌ సీఎం తెలిపారు.ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎస్‌ ఆదేశించారు. అయితే, అత్యవసర శాఖలపై రెవెన్యూ, పోలీస్‌, ఫైర్‌, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, నీటిపారుదలశాఖ, రోడ్లు భవనాల శాఖల అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూడాలని సీఎస్‌ సూచించారు. ఇదిలా ఉండగా.. గులాబ్‌ తుఫాను నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలు రెడ్‌ అలెర్ట్‌, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.