నలుగురి పేర్లతో పిసిసికి జాబితా సమర్పణ

 


30న భూపల్‌పల్లి సభలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రకటన

పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర
హుజూరాబాద్‌,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో అందరి దృష్టి ఈ ఎన్నిక విూదే ఉంది. ఇక్కడ ఇప్పటికే టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌, బీజేపీ అభ్యర్థిగా మాజీమంత్రి ఈటల రాజేందర్‌ బరిలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనే అంశంపైనే ఆసక్తి నెలకొంది. ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చిన తరువాత అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావించింది. ఇప్పుడు ఆ సమయం రావడంతో.. అభ్యర్థి ఎంపికపై ఫోకస్‌ చేయనుంది. ఈ అంశంపై పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ స్పందించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటివరకు 19 మంది దరఖాస్తు చేసుకున్నారని రాజనర్సింహ వెల్లడిరచారు.
దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి పీసీసీకి నివేదిక అందించినట్టు ఆయన తెలిపారు. సామాజిక వర్గాల వారీగా నలుగురి పేర్లను తుది జాబితాలో చేర్చామని ఆయన వివరించు. ఈ నెల 30న భూపాలపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ సభ ఉందని తెలిపిన రాజనర్సింహ.. ఆ సభ అనంతరం హుజూరాబాద్‌
అభ్యర్థిని ప్రకటిస్తామని వివరించారు.