జిల్లాలో చిరుత పులి కలకలం


అప్రమత్తం అయిన అటవీ సిబ్బంది

నిజామాబాద్‌,సెప్టెంబర్‌30 (జనం సాక్షి) : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో చిరుతపులి కలకలం రేపుతున్నది. జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నది. 15 రోజుల క్రితం బీర్కుర్‌ మండలంలో ప్రత్యక్షమైన చిరుత.. పశువులపై దాడిచేసింది. దీంతో చిరుతపులిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది బోను ఏర్పాటు చేశారు. తప్పించుకుని తిరుగుతున్న చిరుత రోజుకో ప్రాంతంలో ప్రత్యక్షమవుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నది. తాజాగా బుధవారం రాత్రి మంజీరా నది తీరంలో మరోసారి కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.