మాజీ ఎమ్మెల్యే కోడూరి కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ


కరీంనగర్, సెప్టెంబర్ 28:--
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ తల్లి ఇటీవలే పరమపదించిన నేపథ్యంలో నగరంలో ఆయన నివాసంలో సత్యనారాయణ గౌడ్ ను కరీంనగర్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్సీ వెంట పరామర్శించిన వారిలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సమద్ నవాబ్, ఉప్పరి రవి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కొలిపాక సందీప్, అబ్దుల్ రహమాన్, ఖమరొద్దీన్, ముక్క భాస్కర్, తమ్మడి ఏజ్రా  తదితరులు పాల్గొన్నారు.