స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాన్ని 30 శాతం మేర పెరిగాయి. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.13వేలకు చేరింది. ప్రస్తుతం వారి వేతనం రూ.10వేలుగా ఉన్నది. ఎంపీటీసీలు, సర్పంచుల వేతనం రూ.6500కు పెరిగింది. ప్రభుత్వం నిర్ణయంతో ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.