కోపేన్,సెప్టెంబర్27 (జనంసాక్షి) : పోలిష్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్ పుల్లెల, సామియా ఇమాద్ ఫారూఖీ రన్నరప్‌గా నిలిచారు. మహిళల డబుల్స్ విభాగం ఫైనల్లో గాయత్రి త్రిషా జాలీ (భారత్) ద్వయం 10`21, 18`21తో మార్గోట్ లాంబర్ట్ యాన్ ట్రాన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సామియా 11`21, 9`21తో మూడో సీడ్ యు యాన్ జస్లిన్ హుయ్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూసింది.
పోలిష్ ఓపెన్‌లో గాయత్రి రన్నరప్