గుంటూరు జడ్పీ ఎస్పీ కాదంటూ పిటిషన్‌

అమరావతి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : ఇటీవల ఎన్నికైన గుంటూరు జడ్పీ చైర్మన్‌ క్రిస్టినా ఎస్సీ కాదంటూ ఎపి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. క్రిస్టినా తప్పుడు ధృవ పత్రం సమర్పించారని తెనాలికి చెందిన సరళకుమారి అనే మహిళ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయంపై గతంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.