ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య


హైదరాబాద్‌,సెప్టెంబర్‌21 (జనంసాక్షి):  చాలాకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. గుంటూరు జిల్లా నెమలికల్లుకు చెందిన ఈవూరి ప్రవీన్‌రెడ్డి(28) బీటెక్‌ పూర్తి చేశాడు. ఇటీవల ఉద్యోగాన్వేషణలో నగరానికి వచ్చాడు. బాపునగర్‌లోని ఓ హాస్టల్‌ ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అయినప్పటికీ ఉద్యోగం లభించకపోవడంతో సోమవారం సాయంత్రం హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు హాస్టల్‌ నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు.