విద్యుత్‌ విూటర్ల మాయాజాలం

నిర్మల్‌,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)   : నిర్మల్‌ జిల్లాలో విద్యుత్‌ విూటర్లు వినియోగదారుల గుండెల్లో దడ పుట్టిస్తునాయి. ఖానాపూర్‌ పట్టణంలో విద్యుత్‌ విూటర్లు కనెక్షన్‌ లేకుండానే రీడిరగ్‌ తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించి విద్యుత్‌ విూటర్లు చేతితో పట్టుకుంటే చాలు రీడిరగ్‌ తిరుగుతున్నాయి. దీనిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విూటర్ల వల్ల విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విూటర్లతో ప్రజలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.