ఇద్దరిని బలి తీసుకున్న విద్యుత్‌ తీగలు


మహబూబాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : విద్యుత్‌ వైర్లు ఇద్దరి మరణానికి కారణమయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని గూడూరు మండలం బొదుగొండకు చెందిన గుగులోత్‌ భూలి పొలంలో కూలి పనికి వెళ్లింది. ఈ క్రమంలో పంట చేనుకు పెట్టిన విద్యుత్‌ తీగలు తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన భూలి కుమారుడు పొలం యజమాని అయిన ఈర్యపై దాడిచేశాడు. యువకుని దాడితో ఈర్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.