ధర్మపథం కార్యక్రమానికి సిఎం జగన్‌ శ్రీకారం

అమరావతి,సెప్టెంబర్‌27(జనంసాక్షి)  : దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో దేవాదయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.