ఊట్కూరు మండలంలో విషాదం

 


చెరువులో తల్లీ కూతుళ్ల మృతదేహాలు.. గుర్తించిన స్థానికులు

నారాయణపేట: జిల్లాలోని ఊట్కూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండా చెరువులో తల్లి, రెండేండ్ల చిన్నారి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిది ఆత్మహత్య లేదా హత్య చేసి ఉంటారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.