కేర‌ళ‌లోతగ్గిన కరోనా కేసులు

 తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ( Covid in Kerala ) త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. వ‌రుస‌గా రెండో రోజూ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య త‌క్కువ‌గానే న‌మోద‌య్యింది. ఇవాళ కొత్త‌గా 11,196 మందికి పాజిటివ్ వ‌చ్చింది. అయితే, క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య మాత్రం పాజిటివ్ కేసుల కంటే చాలా ఎక్కువ‌గా న‌మోద‌య్యింది. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా బాగా త‌గ్గింది. ఇవాళ మొత్తం 18,849 మంది క‌రోనా బారి నుంచి కోలుకున్నారు.

క‌రోనా మ‌ర‌ణాలు మాత్రం ఇవాళ కూడా 100కు త‌గ్గ‌లేదు. కొత్త‌గా 149 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 24,810కి పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో మొత్తం 96,436 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు. కాగా, ప్ర‌స్తుతం క‌రోనా బారి నుంచి కోలుకున్న వారు, మ‌ర‌ణించిన వారు పోను మ‌రో 1,49,356 యాక్టివ్ కేసులు ఉన్నాయి.