రేవంత్‌ పై కేటీఆర్‌ కేసు నమోదుపరువు నష్టం దావా వేసిన కేటీఆర్‌

డ్రగ్స్‌ కేసులో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్న హైకోర్టు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి)  :

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు, ఈడీ కేసులకు సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని సిటీ సివిల్‌ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీచేసింది. డ్రగ్స్‌ వ్యవహారంలో తనపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కేటీఆర్‌ పరువునష్టం దావా వేయడం తెలిసిందే. దీనిపై ఈరోజు విచారణ జరిపిన సిటీ సివిల్‌ కోర్టు ఇంజంక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో టీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్‌ రెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 20కి వాయిదా వేసింది. డ్రగ్స్‌ నేపథ్యంలో కొన్నిరోజుల కిందట రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ, మంత్రి టీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్‌ డ్రగ్స్‌ టెస్టు చేయించుకుని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైట్‌ ఛాలెంజ్‌ విసిరారు. అందుకు దీటుగా బదులిచ్చిన కేటీఆర్‌, ఆపై రేవంత్‌ మీద పరువునష్టం దావా వేశారు.

పోర్న్‌ సినిమాల కేసులో రాజ్‌కుంద్రా జైలు నుంచి విడుదలబెయిల్‌ మంజూరు చేసిన ముంబైకోర్టుపోర్న్‌ సినిమాల కేసులో రెండు నెలల క్రితం అరెస్టయిన వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈకేసులో 50వేల ష్యూరిటీతో ముంబైకోర్టు ఆయనకు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. లాంఛనాలు పూర్తి చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. గ్రహణం వీడితే మళ్లీ మంచిరోజులు వస్తాయనడానికి సంకేతమే ఇంద్రధనస్సు అంటూ శిల్పాశెట్టి ట్వీట్‌ చేశారు. రాజ్‌కుంద్రా జైలు నుంచి వస్తున్న సమయంలో జైలు బయట గుమిగూడిన మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తూ, ప్రశ్నలు సంధించడంతో ఆయన కంటతడి పెట్టుకున్నారు. రాజ్‌ కుంద్రా బయటకు వచ్చిన విషయాన్ని శిల్పాశెట్టి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘పడిలేచిన కెరటం’ అని క్యాప్షన్‌ తగిలించింది.