కాంగ్రెస్‌లో చేరనున్న కన్నయ్య, జిగ్నేష్‌ మేవాని

న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి);  సీపీఐ నేత కన్నయ్య కుమార్‌, రాష్టీయ్ర దళిత్‌ అధికార్‌ మంచ్‌ (ఆర్‌డీఏఎం) ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవాని ఈనెల 28న కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సమక్షంలో వీరిద్దరూ అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకుంటారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే యువనేతల చేరికకు మరింత ముందుగా సెప్టెంబర్‌ 28నే ముహుర్తం ఖరారు చేశారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్‌ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్‌ మెవానీకి కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు. ఇక జేఎన్‌యూ విద్యార్ధి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ ఇప్పటికే కాంగ్రెస్‌లో తన పాత్రపై రాహుల్‌, ప్రియాంకలతో పలుమార్లు చర్చించారు. కన్నయ్య కుమార్‌కు సైతం బిహార్‌లో పార్టీ కీలక బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. మరోవైపు పంజాబ్‌లో దళిత సీఎం నియామకం పట్ల జిగ్నేష్‌ మెవానీ కాంగ్రెస్‌ పార్టీపై మరింత సానుకూలత కనబరుస్తున్నారు.