బాటసింగారానికి పండ్ల మార్కెట్‌ తరలింపు

కొత్తపేట స్థలంతో ఆస్పత్రి నిర్మాణం చేపడతాం: మంత్రి

హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి) : నగర శివార్లలోని బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్కుకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్కును మంత్రులు మహముద్‌ అలీ, నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డితో పాటు పలువురు పరిశీలించారు. అనంతరం మంత్రి నిరంజన్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. దసరా నుంచి బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్కులో పండ్ల మార్కెట్‌ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. వర్తకులు, రైతుల అవసరాల దృష్ట్యా గడ్డిఅన్నారం నుంచి మార్కెట్‌ తరలింపు
నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బాటసింగారంలో అదనంగా రోడ్లు, పార్కింగ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోహెడలో 178 ఎకరాల్లో మార్కెట్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. గడ్డిఅన్నారం మార్కెట్‌ స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.