గోతులు పూడ్చి ..ఫోటోలు దిగడం ఫ్యాషన్‌


దాన్ని ఆందోళన అని ఎలా అంటారు..

కెమెరా ఆన్‌ చేసి యాఓన్‌ అన్నట్లుగా పవన్‌ వ్యవహారం
బద్వేలులో జనసేన పోటీచేసినా అభ్యంతరం లేదన్న సజ్జల
కులాల మద్య చిచ్చుతో రాజకీయ లబ్ది రాదన్న మంత్రి సురేశ్‌
అమరావతి,అక్టోబర్‌1 (జనం సాక్షి) : కెమెరా అన్‌ చేసి యాక్షన్‌ అనగానే చెయ్యడానికి ఇది సినిమా కాదు... గోతులు పూడ్చి ఫోటోలు దిగి చేసే ఆందోళనల వల్ల ప్రయోజనం లేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. సినిమాటిక్‌ రాజకీయాలు మానుకోవాలన్నారు. పవన్‌ కల్యాణ్‌ చేసే శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. పవన్‌ పబ్లిసిటీ పోరాటాలు చెయ్యడం మానుకోవాల న్నారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం 2,200 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేస్తున్నాం. చీప్‌ పబ్లిసిటి కోసం ఇలాంటి పనులు చెయ్యడం పవన్‌ కల్యాణ్‌ మానుకోవాలన్నారు. అలాగే పవన్‌ స్థాయికి మేము దిగజారాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. జనసేన దిశ లేకుండా ప్రయాణం చేస్తుందని ఎద్దేవా చేశారు. బద్వేల్‌ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా మాకు నష్టం లేదు.. అసలు ఎన్నకల్లో పోటీ చేయడానికి పవన్‌కు ఉన్న ఫ్యాక్టర్‌ ఎంత అనిసజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. బద్వేల్‌ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసిన నష్టం ఏమి లేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్‌కు ఉన్న ఫ్యాక్టర్‌ ఎంత అని సజ్జల ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విమర్శలు గుప్పించారు. పవన్‌ రాష్టాన్రికే ఓ గుదిబండగా తయారయ్యారని ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్‌.. కులాల మధ్య చిచ్చుపెట్టడం తగదని, పవన్‌ ఎప్పుడో ఒకసారి బయటకొచ్చి కులాల్ని రెచ్చగొట్టి వెళ్లిపోతారని సురేష్‌ విమర్శించారు. రాజకీయంగా ఎదగాలంటే ఇది సరైన పద్ధతి కాదని పవన్‌ తెలుసుకోవాలని మంత్రి సూచించారు. ఎన్నికలు వస్తే ఏదో ఒక అలజడి సృష్టించాలన్నదే పవన్‌ ధోరణి అని ఆదిమూలపు సురేష్‌ అన్నారు. టీడీపీ భావజాలంతోనే పవన్‌ కల్యాణ్‌ వెళ్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.