కృష్ణా ట్రైబ్యునల్‌ నియామకంపై వేసిన పిటిషన్‌ ఉపసంహరణ

 


దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రైబ్యునల్‌ నియామకంపై వేసిన పిటిషన్‌ ఉప సంహరణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కృష్ణా జిల్లాల పంపకంపై తెలంగాణ గతంలో కొత్త ట్రైబ్యునల్‌ను కోరింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ ఉపసంహరించుకుంటే కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటును పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. ఈ సూచనతో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ ఉప సంహరణకు సుప్రీంకోర్టును అనుమతి కోరింది. దీంతో పిటిషన్‌ ఉప సంహరణకు త్రిసభ్య ధర్మాసనం అనుమతిచ్చింది.ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై ప్రస్తుతం ఆదేశాలు ఇవ్వట్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా, పిటిషన్‌ ఉపసంహరణపై ఏపీ, కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేశాయి. అభ్యంతరాలు దాఖలుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ధర్మాసనాన్ని అవకాశం కోరాయి. స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఏపీ, కర్ణాటకకు అభ్యంతరాల దాఖలుకు అనుమతిచ్చింది.