వరంగల్, అక్టోబర్26(జనం సాక్షి); దుగ్గొండి మండలం చాపలబండలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. చాపలబండలో ఇప్పటి వరకు నాలుగు గొర్రెలు మృతి చెందాయి. వ్యాధి లక్షణాలున్నగొర్రెలను ఊరికి దూరంగా ఉంచాలని యజమానులను అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా వెటర్నరీ అధికారులు మాట్లాడారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా గొర్రెలకు టీకాలు ఇస్తున్నామని తెలిపారు. పరీక్షల కోసం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెటర్నరీ అధికారులు స్పష్టం చేశారు.
దుగ్గొండిలో ఆంత్రాక్స్ లక్షణాలతో గొర్రెలు మృతి