రైతు చట్టాలను ఉపసంహరించే వరకు పోరు

యూపిలో అన్యాయంగా రైతులను తొక్కి చంపారు
మండిపడ్డ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌, భట్టి
హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): యూపీలో బీజేపీ నేతలు రైతులను రాక్షసంగా చంపేశారని...దీనిపై మోడీ, అమిత్‌ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఇది కాంగ్రెస్‌ సమస్య కాదు 80 శాతం మంది రైతుల సమస్య అని అన్నారు. 80 కోట్ల మంది రైతులను బానిసలుగా మార్చే కుట్ర చేశారని ఆరోపించారు. రైతుకు మరణ శాసనం రాసే చట్టాలు చేశారని..దీనిపై రైతులు తిరగబడి ఎర్రకోటపై జెండా ఎగరేశారని తెలిపారు. కేసీఆర్‌ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్లు చెప్పారని అయితే ఢల్లీికి వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్‌కు చలిజ్వరం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానిం చారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకే రైతులను కారుతో తొక్కించి చంపారన్నారు. ఈ దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే మోడీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశ ప్రజల మన్‌ కీ బాత్‌ విను మోడీ అని హితవుపలికారు. సిరిసిల్లలో కూడా దళితులను ఇసుక లారీలతో గుద్ది చంపారని ఆరోపించారు. పాలకులే ప్రజలను భయపెట్టి, చంపి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. రైతులను చంపిన వారిని నడిబజారులో ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ఢల్లీికి వెళ్లి మోడీకి లొంగిపోయారని విమర్శించారు. మోదీ, కేసీఆర్‌ను బొందపెడితేనే దేశంలో రాష్ట్రంలో శాంతి ఉంటుం దన్నారు. మోదీ, అమిత్‌ షా రైతుల హత్యలను ఖండిరచి జాతికి క్షమాపణ చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన చట్టాలను కాంగ్రెస్‌ నిరసిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆ చట్టాలను కేంద్రం విరమించుకోవాలన్నారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడాలన్నారు. రైతులను చంపిన కేంద్ర మంత్రి కుమారుడికి, కేంద్రానికి బుద్ధిచెప్పే వరకు కాంగ్రెస్‌ పోరాడుతుందని భట్టి పేర్కొన్నారు. రైతులను చంపైనా వ్యవసాయాన్ని కార్పోరేట్‌ చేతుల్లో పెడతామని కేంద్రం అంటోందన్నారు. దీనిపై మౌనంగా ఉన్న కేసీఆర్‌ వైఖరిని కూడా కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందన్నారు. రైతుల కోసం కాంగ్రెస్‌ పోరాడుతుందని భట్టి తెలిపారు. ఇక దళితబంధు పథకాన్ని నిధులు లేకుండా ఒట్టిగా అమలు చేస్తామంటున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బ్జడెట్‌లో సీఎం దళిత సాధికారత పథకం కోసం రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లక్షల దళిత కుటుంబా లకు రూ.లక్షా 70 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని దళిత ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. విూరు చెప్పినట్టు దీనికి నిధులు ఎలా సమకూరుస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆలోచనలుగొప్పగా ఉన్నా, వాటి అమలుపై అనుమానాలు ఉన్నాయ న్నారు. దళితబంధు కింద లబ్దిదారులకు రూ.10 లక్షలు ఇస్తే వాళ్లు రెండు, మూడు వ్యాపారాలు చేసు కోవచ్చా.. వారికి నచ్చే వ్యాపారం చేసుకోవచ్చా.. అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని భట్టివిక్రమార్క కోరారు.
...................