ఫ్రాన్స్‌ పర్యటనకు కెటిఆర్‌ బృందం


హైదరాబాద్‌,అక్టోబర్‌27( జనం సాక్షి); ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం పయనమైంది. ఫ్రెంచ్‌ సెనేట్‌లో జరిగే యాంబిషన్‌ ఇండియా 2021 కార్యక్రమంలో ఈ నెల 29న మంత్రి కేటీఆర్‌ కీలకోపన్యాసం చేయనున్నారు. పలువురు ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో సమావేశం కానున్నారు. మంత్రితో పాటు ప్రతినిధి బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.