విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు

వికారాబాద్‌,అక్టోబర్‌9 (జనంసాక్షి):  వికారాబాద్‌ జిల్లా పరిగి పోలీసు స్టేషన్‌లో యువతి మిస్సింగ్‌ కేసు నమోదైంది. పూడూరు మండలం నిజాంపేట మేడిపల్లికి చెందిన సునంద (21) ఈ నెల 7 నుంచి అదృశ్యమైంది. పరిగిలోని వేంకటేశ్వర డీగ్రీ కళాశాలలో పరీక్షలు రాసేందుకు వెళ్ళి మిస్‌ అయ్యింది. పరిగి పోలీసు స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.