తుంగభద్ర డ్యాంకు వరద


అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 21,692 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 10,497 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 99.316 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1632.60 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.

ఆర్డీఎస్ ఆనకట్టకు
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నిలకడగా చేరుతోంది. ఆదివారం ఆర్డీఎస్ ఆనకట్టకు 7,952 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 7,500 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.9అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నా రు. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 452 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.