సర్కార్‌ స్కూళ్లకు శస్త్ర చికిత్స

 టీచర్లతో సవిూక్షిస్తూ ముందుకు సాగుతున్న డిఇవో

సత్ఫలితాలు లక్ష్యంగా ఉపాధ్యాయులకు ప్రేరణ
నిర్మల్‌,అక్టోబర్‌26 (జనంసాక్షి ) : నూతనంగా డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా మలిచేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆయన అన్ని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ పాఠశాలల పనితీరు మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత హెడ్మాస్టర్‌లు, ఉపాధ్యాయులతో డీఈఓ సవిూక్ష సమావేశం నిర్వహించి ఆ పాఠశాలల పనితీరు మెరుగు పడేందుకు చర్యలు చేపట్టారు. అలాగే పాఠశాలల్లోని సౌకర్యాలపై కూడా
ఆయన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మధ్యాహ్నభోజన విషయంలో నాణ్యత ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. ఆయన చేపట్టిన కొత్తతరహా కార్యాచరణతో పాఠశాలల పనితీరు మరింతగా మెరుగు పడిరదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో జిల్లాను ముందుస్థానంలో ఉంచేందుకు కార్యాచరణ రూపొందించామని జిల్లా విద్యాశాఖఅధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్‌ సహకారంతో ఉమ్మ డి ప్రణాళికను అమలు చేయబోతున్నట్లు వెల్లడిరచారు.
జిల్లాలో ప్రస్తుతం 76,276 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ల పరిధిలోని 695 పాఠశాలల్లో ప్రస్తుతం 53,695 మంది విద్యార్థులు నమోదయ్యారు. అయితే ఇటీవల కొత్త డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌రెడ్డి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మొదట ఉపాధ్యాయ సంఘాలతోనూ, హెడ్మాస్టర్‌లతోనూ, అలాగే సంబంధిత అధికారులతోనూ జిల్లాలో సర్కారు బడుల పరిస్థితి మెరుగుకోసం ఆయన సవిూక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల ఆధారంగా ఆయన పకడ్బందీ యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించి అందుకు అనుగుణంగా చర్యలు మొదలుపెట్టారు. అన్నిరకాల ప్రభుత్వ యజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ప్రస్తుతం 76,276 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. ఇందులో నుంచి మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 53,698 మంది, మహత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 2,474 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 3870 మంది, సోషల్‌వెల్పేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 2,822 ట్రైబల్‌వెల్పేర్‌ ఆశ్రమ పాఠశాలల్లో 3174 మంది విద్యార్థులు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో 4,906 మైనార్టీ వెల్పేర్‌లో 1731, మినీ గురుకులంలో 112, డీఎన్‌టీ స్కూల్‌లలో 194, మోడల్‌స్కూల్‌లలో 790 మంది విద్యార్థులు ప్రస్తుతం తమ భోధనను కొనసాగిస్తున్నారు. ఈ సంఖ్య గతానికి రెండిరతలుగా ఉందంటున్నారు. ఇలా విపరీతంగా విద్యార్థుల సంఖ్య పెరిగిపోవడంతో సర్కారు బడులకు పూర్వవైభవం చేకూరిందన్న అభిప్రాయాలున్నాయి. ఈ వైభవాన్ని కాపాడేందుకు సర్కారు మరింత చేయూతనందించాల్సిన అవసరం ఉందని అలాగే ఈ వైభవం చేజారకుండా చూసుకునే బాధ్యత టీచర్లు, విద్యాశాఖదేనంటున్నారు.