రోడ్డు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి: ఎర్రబెల్లి

 


హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : సింగరేణి మండలం చీమలవారిగూడెం నుండి పేరేపల్లి గ్రామం మధ్య రోడ్డు, బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైరా ఎమ్మెల్యే రాములు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.సింగరేణి మండలం చీమలవారి గూడెం నుండి పేరేపల్లి గ్రామం మధ్య రోడ్డు, బ్రిడ్జి కోసం 4 కి. విూ. బీటీ రోడ్డుతో పాటు 12 సీడీ పనులను రూ. 5 కోట్లతో సంబధిత అధికారులు అంచనా వేశారన్నారు. ఆ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.