ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌ 26 (జనం సాక్షి);  జిల్లా కేంద్రంలోని మధురానగర్‌లో విషాదం నెలకొంది. భార్యాభర్తలు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను నరసింహారెడ్డి (54), లత (48) గా పోలీసులు గుర్తించారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు.